AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆదివారం ఇంజినీరింగ్ స్పెషల్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్

. మొదటి, రెండో దశ కౌన్సిలింగ్, స్పాట్ అడ్మిషన్లలో ప్రవేశం పొందలేని విద్యార్ధులు ఈ ప్రత్యేక దశ కౌన్సిలింగ్ కు అర్హత ఉంది. అయితే ఇప్పటికే ప్రవేశాల కోసం రిజిస్టేషన్ చేసుకున్న వారిని మాత్రమే ఈ ప్రత్యేక దశలో అప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. కొత్తగా రిజిస్ట్రేషన్లకు అవకాశం లేదు. విద్యార్ధుల నుండి వచ్చిన అభ్యర్ధనతో స్పెషల్ ఫేస్ కౌన్సిలింగ్ కు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.

ఆదివారం ఇంజినీరింగ్ స్పెషల్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్
Engineering Special counselling
pullarao.mandapaka
| Edited By: |

Updated on: Nov 04, 2023 | 8:07 PM

Share

ఇంజనీరింగ్ ప్రత్యేక దశ అడ్మిషన్ల ప్రక్రియకు నవంబర్ ఐదో తేదీన సాంకేతిక విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేయనుంది. నవంబర్ ఆరో తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అందుకు సంబందించిన షెడ్యూల్‌ను సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి ప్రకటించారు. ఉన్నత విద్యామండలి జారీ చేసిన జీవో నెం.179ను అనుసరించి ఏపీఈఈసెట్-2023 లో అర్హత సాధించిన అభ్యర్థులు కోసం ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే మొదటి విడత, రెండో విడత కౌన్సిలింగ్ పూర్తయింది. దాని తర్వాత స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ కూడా ముగిసింది.సాధారణంగా ఇంజనీరింగ్ స్పాట్ అడ్మిషన్లు ముగిసిన తర్వాత కన్వీనర్ కోటా సీట్లకు అడ్మిషన్లు నిర్వహించడం గతంలో ఎప్పుడూ లేదు. అందుకే ఈ సంవత్సరాలనికి మాత్రమే వర్తించేలా ఈ ప్రత్యేక కౌన్సిలింగ్ ను చేపడుతున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొదటి, రెండో దశ కౌన్సిలింగ్, స్పాట్ అడ్మిషన్లలో ప్రవేశం పొందలేని విద్యార్ధులు ఈ ప్రత్యేక దశ కౌన్సిలింగ్ కు అర్హత ఉంది. అయితే ఇప్పటికే ప్రవేశాల కోసం రిజిస్టేషన్ చేసుకున్న వారిని మాత్రమే ఈ ప్రత్యేక దశలో అప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. కొత్తగా రిజిస్ట్రేషన్లకు అవకాశం లేదు. విద్యార్ధుల నుండి వచ్చిన అభ్యర్ధనతో స్పెషల్ ఫేస్ కౌన్సిలింగ్ కు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.

ప్రత్యేక దశ అడ్మిషన్లకు ప్రభుత్వ పథకాల వర్తింపు

ప్రత్యేక దశ లో చేసిన ప్రవేశాలకు కూడా కన్వీనర్ కోటాతో సమానంగా ఫీజు రీఎంబర్స్ మెంట్ వంటి అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు అనుమతి ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల లోని బీఈ, బీటెక్ కోర్సుల్లో ఖాళీలను అనుసరించి, నిబంధనల మేరకు అడ్మిషన్లు చేయనున్నారు. నవంబర్ ఐదో తేదీ ఆదివారం నోటిఫికేషన్ జారీ చేయనుండగా, నవంబరు 6, 7 తేదీలలో రెండు రోజుల పాటు వెబ్ ఆప్షన్‌ల నమోదుకు అవకాశం ఇవ్వనున్నారు. నవంబరు 8వ తేదీ ఆప్షన్ల మార్పుకు అనుమతి ఉంటుంది. నవంబరు పదిన సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీట్లు కేటాయించిన కళాశాలలో నవంబరు 11 నుండి 13 వరకు విద్యార్ధులు వ్యక్తిగతంగా రిపోర్టు చేయవలసి ఉంటుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అందుకే రైతులకు డబ్బులు ఇవ్వలేదు: బిగ్‌బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్
అందుకే రైతులకు డబ్బులు ఇవ్వలేదు: బిగ్‌బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్
దూసుకొస్తున్న గండం.. ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
దూసుకొస్తున్న గండం.. ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
ఛీ, ఇంత స్వార్థపరుడనుకోలే.. మనోడు కూడా మోసం చేస్తాడనుకోలే..
ఛీ, ఇంత స్వార్థపరుడనుకోలే.. మనోడు కూడా మోసం చేస్తాడనుకోలే..
ట్రాఫిక్ లైట్లలో ఎరుపు,పసుపు, ఆకుపచ్చ రంగులనే ఎందుకు ఉపయోగిస్తారు
ట్రాఫిక్ లైట్లలో ఎరుపు,పసుపు, ఆకుపచ్చ రంగులనే ఎందుకు ఉపయోగిస్తారు
రూ. 16లకే షాపింగ్ ఆఫర్.. ఒక్కసారిగా విరుచుకుపడ్డ జనం.. కట్ చేస్తే
రూ. 16లకే షాపింగ్ ఆఫర్.. ఒక్కసారిగా విరుచుకుపడ్డ జనం.. కట్ చేస్తే
చిన్న ట్రిక్ లక్షలు మిగిల్చింది..
చిన్న ట్రిక్ లక్షలు మిగిల్చింది..
వ్యాయామాలు లేకుండానే పొట్ట తగ్గించే జపనీయుల 5 ఉదయపు అలవాట్లు
వ్యాయామాలు లేకుండానే పొట్ట తగ్గించే జపనీయుల 5 ఉదయపు అలవాట్లు
తల్లి చీరలో తళుక్కుమన్న త్రిష.. బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
తల్లి చీరలో తళుక్కుమన్న త్రిష.. బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
పాలకూరతో ఇలా ఒక్కసారి చేసి చూడండి.. నోట్లో వెన్నలా కరిగిపోతుంది
పాలకూరతో ఇలా ఒక్కసారి చేసి చూడండి.. నోట్లో వెన్నలా కరిగిపోతుంది
బర్త్ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం.. నెల రోజుల్లో 600 వీసాలు రద్దు!
బర్త్ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం.. నెల రోజుల్లో 600 వీసాలు రద్దు!