AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC Group 1 Mains 2023: తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌.. సిలబస్‌, పరీక్ష విధానం ఇదే..

తెలంగాణ గ్రూప్‌-1 మెయిన్స్‌ 2023 పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను టీఎస్పీయస్సీ మంగళవారం (జనవరి 31) విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారందరికి జూన్..

TSPSC Group 1 Mains 2023: తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌.. సిలబస్‌, పరీక్ష విధానం ఇదే..
TSPSC Group-1 Mains
Srilakshmi C
|

Updated on: Jan 31, 2023 | 6:23 PM

Share

తెలంగాణ గ్రూప్‌-1 మెయిన్స్‌ 2023 పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను టీఎస్పీయస్సీ మంగళవారం (జనవరి 31) విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారందరికి జూన్ 5,6,7,8,9,10,12 తేదీల్లో మొత్తం 7 పేపర్లకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తప్పనిసరిగా హాజరుకావల్సి ఉంటుంది. ఏ పేపర్‌కైనా గైర్హాజరైతే సదరు అభ్యర్ధిని అనర్హుడిగా పరిగణిస్తామని కమిషన్‌ సూచించింది. గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష ఇంగ్లిష్‌, ఉర్దూ, తెలుగు భాషల్లో నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపింది. జనరల్‌ ఇంగ్లిష్ పేపర్‌ మినహా మిగతా పేపర్లన్నీ ఇంగ్లీష్ లేదా ఉర్దూ లేదా తెలుగు ఈ మూడు భాషల్లో ఏదైనా ఒక మాధ్యమంలో పరీక్షలు రాసేందుకు కమిషన్‌ అనుమతిచ్చింది. జనరల్‌ ఇంగ్లిష్‌ పేపర్‌ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. అంటే ఈ పేపర్లో సాధించిన మార్కులను ర్యాంక్‌ కౌటింగ్‌కు లెక్కించడం జరగదు. కాగా 503 గ్రూప్‌-1 సర్వీసులకు గతేడాది అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు కూడా వెలువడ్డాయి.

టీఎస్పీయస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్ తేదీలు ఇవే..

  • జూన్ 5న జనరల్ ఇంగ్లీష్
  • జూన్ 6న జనరల్ ఎస్సే
  • జూన్ 7న హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ
  • జూన్ 8న ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, పాలన
  • జూన్ 9న ఎకానమీ, డెవలప్ మెంట్
  • జూన్ 10న సైన్స్ అండ్ టెక్నాలజీ, డాటా ఇంట్ప్రిటేషన్
  • జూన్ 12న తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ

ఒక్కో పేపర్‌కు 150 మార్కుల చొప్పున మూడు గంటల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది.

టీఎస్పీయస్సీ గ్రూప్-1 మెయిన్స్ పూర్తి షెడ్యూల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
హైదరాబాద్‌లో తొలిసారిగా డబుల్ డెక్కర్ కారిడార్.. ఎక్కడంటే..?
హైదరాబాద్‌లో తొలిసారిగా డబుల్ డెక్కర్ కారిడార్.. ఎక్కడంటే..?
ఉన్నట్లుండి భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఇప్పుడు ఎంతంటే..?
ఉన్నట్లుండి భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఇప్పుడు ఎంతంటే..?
రెడ్‌ డ్రెస్‌లో అదిరిపోయిన బెబో లుక్
రెడ్‌ డ్రెస్‌లో అదిరిపోయిన బెబో లుక్
ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఏఎస్ఐ లీలలు.. అప్పట్లోనే..
ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఏఎస్ఐ లీలలు.. అప్పట్లోనే..
పాండ్యా బ్రదర్స్ మధ్య ముదిరిన విబేధాలు? .. సాక్ష్యం ఇదే
పాండ్యా బ్రదర్స్ మధ్య ముదిరిన విబేధాలు? .. సాక్ష్యం ఇదే
ఉదయాన్నే టిఫిన్ బదులు ఇది తిని చూడండి.. దెబ్బకు బాడీ కూల్‌
ఉదయాన్నే టిఫిన్ బదులు ఇది తిని చూడండి.. దెబ్బకు బాడీ కూల్‌
ఊరికి కొత్త.. రెస్టారెంట్‌ అనుకుని చావు ఇంటికి వెళ్లిన పర్యాటకులు
ఊరికి కొత్త.. రెస్టారెంట్‌ అనుకుని చావు ఇంటికి వెళ్లిన పర్యాటకులు
వామ్మో.. కండలు తిరిగిన బాడీతో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్.
వామ్మో.. కండలు తిరిగిన బాడీతో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్.
ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్ టిమ్ డేవిడ్‌కు షాక్
ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్ టిమ్ డేవిడ్‌కు షాక్
ఎండాకాలంలో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి చాలు..
ఎండాకాలంలో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి చాలు..