తెలంగాణ రాష్ట్ర సర్కార్ డిసెంబర్ 9న 1392 జూనియర్ లెక్చరర్ పోస్టులను టీఎస్సీయస్సీ ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సబ్జెక్టుల వారీగా ఆయా పోస్టులను రాత పరీక్ష ద్వారా నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ క్రమంలో సివిక్స్ సబ్జెక్టు జూనియర్ లెక్చరర్ కొలువులకు అర్హతల విషయంలో నిరుద్యోగుల్లో కొంత సందిగ్ధత నెలకొంది. దీనిపై విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ క్లారిటీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పీజీ స్థాయిలో పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్‌లలో 50 శాతం మార్కులతో పాసైన వారు కూడా అర్హులేనని, ఈ అర్హతలున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టత ఇచ్చారు. అలాగు పదో తరగతి వరకు ఉర్దూ/మరాఠీ లేదా పదో తరగతిలో ఫస్ట్ ల్యాంగ్వేజ్‌గా చదివినా లేదా డిగ్రీలో సెకండ్ ల్యాంగ్వేజ్‌గా చదివిన వారు ఉర్దూ/మరాఠీ మీడియంలో లెక్చరర్ పోస్టులకు అర్హలవుతారని ఈ సదర్భంగా వివరించారు.
టీఎస్సీయస్సీ జేఎల్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు డిసెంబర్ 16 నుంచి వచ్చే ఏడాది (2023) జనవరి 6 వరకు కొనసాగుతాయి. వీటికి సంబంధించిన రాత పరీక్ష 2023 జున్ లేదా జూలైలో నిర్వహిస్తారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.