హైదరాబాద్, మే 9: తెలంగాణలో ఈఏపీసెట్ 2024 ప్రవేశ పరీక్షలు జరగుతున్న సంగతి తెలిసిందే. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు మే 7, 8 తేదీల్లో జరిగాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీని మే 11వ తేదీన విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఓ ప్రకటనలో తెలియజేసింది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు మే 11 నుంచి 13వ తేదీ వరకు ప్రిలిమినరీ ఆన్సర్ కీతో పాటు రెస్పాన్స్ షీట్, మాస్టర్ ప్రశ్నపత్రాన్ని కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదలైన తర్వాత కీపై అభ్యంతరాలు ఉంటే మే 13వ తేదీ ఉదయం 11 గంటల్లోపు తెలియజేయాలని సూచించింది. అభ్యంతరాలను కేవలం ఆన్‌లైన్ విధానంలో మాత్రమే సమర్పించాలని, ఆఫ్‌లైన్ వచ్చిన వాటిని స్వీకరించబోమని స్పష్టం చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు (మే 9) నుంచి మే 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలు రోజుకు రెండు షిఫ్టుల్లో జరుగుతాయి. ఈ ఏడాది ఈఏపీసెట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా దాదాపు 3,54,803 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. మొత్తం 21 జోన్లలో ఈ పరీక్షలు జరగుతున్నాయి. వీటిల్లో ఏపీలోనూ 5 జోన్లు ఏర్పాటు చేశారు. ఇక నిన్న (మే8న) జరిగిన ఈఏపీసెట్ ఆన్‌లైన్ పరీక్షకు దాదాపు 91.67% మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. గతేడాది రెండో రోజు పరీక్షకు 89.5 శాతం మంది అభ్యర్థులు హాజరుకాగా.. ఈసారి ఆ సంఖ్య పెరిగింది. తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు జూన్ 15న ప్రకటించనున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.