TS DSC 2024 Vacancies: మార్చి 4 నుంచి డీఎస్సీ దరఖాస్తులు.. జిల్లాలవారీగా పోస్టుల వివరాలు ఇవే! ఆ జాల్లాలో అత్యధిక ఖాళీలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ గురువారం (ఫిబ్రవరి 29) సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు మార్చి 4వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఏప్రిల్ 2వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. మొత్తం పోస్టుల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక పోస్టులు ఉన్నాయి..

హైదరాబాద్, మార్చి 1: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ గురువారం (ఫిబ్రవరి 29) సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు మార్చి 4వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఏప్రిల్ 2వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. మొత్తం పోస్టుల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్‌లో 878 పోస్టులు, రంగారెడ్డి జిల్లాలో 379 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలవారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఏయే జిల్లాల్లో ఉపాధ్యాయ ఖాళీల వివరాలు ఎలా ఉన్నాయంటే..
- ఆదిలాబాద్ జిల్లాలో పోస్టులు: 324
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోస్టులు: 447
- హనుమకొండ జిల్లాలో పోస్టులు: 187
- హైదరాబాద్ జిల్లాలో పోస్టులు: 878
- జగిత్యాల జిల్లాలో పోస్టులు: 334
- జనగాం జిల్లాలో పోస్టులు: 221
- భూపాలపల్లి జిల్లాలో పోస్టులు: 237
- గద్వాల జిల్లాలో పోస్టులు: 172
- కామారెడ్డి జిల్లాలో పోస్టులు: 506
- కరీంనగర్ జిల్లాలో పోస్టులు: 245
- ఖమ్మం జిల్లాలో పోస్టులు: 575
- ఆసిఫాబాద్ జిల్లాలో పోస్టులు: 341
- మహబూబాబాద్ జిల్లాలో పోస్టులు: 381
- మహబూబ్‌నగర్ జిల్లాలో పోస్టులు: 243
- మంచిర్యాల జిల్లాలో పోస్టులు: 288
- మెదక్ జిల్లాలో పోస్టులు: 310
- మేడ్చల్ జిల్లాలో పోస్టులు: 109
- ములుగు జిల్లాలో పోస్టులు: 192
- నాగర్‌కర్నూల్ జిల్లాలో పోస్టులు: 285
- నల్లగొండ జిల్లాలో పోస్టులు: 605
- నారాయణ్‌పేట్ జిల్లాలో పోస్టులు: 279
- నిర్లల్ జిల్లాలో పోస్టులు: 342
- నిజామాబాద్ జిల్లాలో పోస్టులు: 601
- పెద్దపల్లి జిల్లాలో పోస్టులు: 93
- సిరిసిల్ల జిల్లాలో పోస్టులు: 151
- రంగారెడ్డి జిల్లాలో పోస్టులు: 379
- సంగారెడ్డి జిల్లాలో పోస్టులు: 551
- సిద్దిపేట జిల్లాలో పోస్టులు: 311
- సూర్యాపేట జిల్లాలో పోస్టులు: 386
- వికారాబాద్ జిల్లాలో పోస్టులు: 359
- వనపర్తి జిల్లాలో పోస్టులు: 152
- వరంగల్ జిల్లాలో పోస్టులు: 301
- యాదాద్రి జిల్లాలో పోస్టులు: 277
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.
