
మంచిగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని చిన్నతనం నుంచి కష్టపడి చదివే వారు చాలా మంది ఉంటారు. చదువు అనేది కేవలం ఉద్యోగం గురించి మాత్రమే కాదు జీవిత సత్యాలను తెలుకోవడానికి అని కొంతమంది చెబుతూ ఉంటారు. అయితే ఒక గోల్ పెట్టుకుని చదువుకుంటే చిన్నవయస్సులోనే దాన్ని రీచ్ అవుతామని నిపుణులు పేర్కొంటూ ఉంటారు. ఇలా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి చిన్నతనం నుంచి అన్నింటా ఫస్ట్ వచ్చి 21 ఏళ్లకే ఐపీఎస్ అయ్యి అందరినీ ఆశ్చర్యపర్చాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆదర్శ్ కాంత్ శుక్లా 21 ఏళ్ల వయస్సులో యూపీఎస్సీ పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆదర్శ్ కాంత సక్సెస్ సీక్రెట్ ఏంటో? ఓసారి తెలుసుకుందాం.
దిగువ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన ఆదర్శ్ తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ ఆదర్శ్ తండ్రి ఐఏఎస్ అధికారి కావాలనే ఆకాంక్షను కలిగి ఉన్నాడు. ఆ కలలు నెరవేరలేదు. అయినప్పటికీ అతను ఐపిఎస్ అధికారి కావాలనే తన లక్ష్యాన్ని సాధించడంలో ఆదర్శ్‌కు హృదయపూర్వకంగా మద్దతు ఇచ్చాడు. బాల్యం నుంచి చదువుల్లో మంచి ప్రతిభను ప్రదర్శిస్తూ ఆదర్శ్ లక్నోలోని నేషనల్ పీజీ కళాశాల నుంచి తన బీఎస్సీ పూర్తి చేశాడు. అక్కడ అతను జీవశాస్త్రంలో గోల్డ్ మెడల్‌ను కూడా సంపాదించాడు. ఇతర రంగాల్లో రాణిస్తున్నప్పటికీ తండ్రి ఆకాంక్షలను నెరవేర్చాలనుకున్నాడు.
2020లోక చ్చితమైన ప్రిపరేషన్ తర్వాత ఆదర్శ్ యూపీఎస్సీ పరీక్షకు హాజరయ్యాడు, 149 ఆల్ ఇండియా ర్యాంక్ (ఏఐఆర్)తో విజేతగా నిలిచాడు. అతను తన కలను సాధించడమే కాకుండా, ఇతర ఆశావహులకు చురుకుగా సలహాలు ఇస్తూ, వారికి ఎలా మార్గనిర్దేశం చేయాలో వారికి మార్గనిర్దేశం చేస్తుననారు. ఆదర్శ్ ప్రయాణం యూపీఎస్సీ ఆస్పిరెంట్స్‌కు ప్రేరణగా పని చేస్తుంది. ముఖ్యంగా అతను విజయం సాధించడానికి అధిగమించిన సవాళ్లను పరిగణనలోకి తీసుకోవాలి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.