Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Top skills: ఆ నైపుణ్యాలు ఉంటే కోరినంత జీతం.. క్యూ కడుతున్న టాప్ కంపెనీలు

నేటి ప్రపంచంలో అన్నిరంగాలలో పోటీతత్వం విపరీతంగా పెరిగింది. చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా అన్ని చోట్లా ఆ పోటీని తట్టుకుని ముందుకు వెళితేనే విజయాలు సాధించగలం. ముఖ్యంగా ఉద్యోగులు నిరంతరం తమ నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకోగలరు. అప్పుడే తొందరగా పదోన్నతులు పొందడంతో పాటు అత్యధిక వేతనం లభించే అవకాశం కలుగుతుంది. ఈ నేపథ్యంలో మన దేశంలో ఉద్యోగులు మంచి జీతం పొందటానికి అవసరమైన నైపుణ్యాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Top skills: ఆ నైపుణ్యాలు ఉంటే కోరినంత జీతం.. క్యూ కడుతున్న టాప్ కంపెనీలు
Employee Skills
Follow us
Srinu

|

Updated on: Apr 02, 2025 | 4:45 PM

సాధారణంగా కొన్ని ఉద్యోగాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. వాటిలో ఉన్నతంగా ఎదగటానికి అవకాశం కలుగుతుంది. అలాంటి వారిలో 2025లో ఏఐ నిపుణులు, రిస్క్ విశ్లేషకులు, అభివృద్ధి వ్యూహకర్తలు, నియంత్రణ సమ్మతి నిపుణులు, పబ్లిక్ స్పీకర్లు ఉన్నారు. వీరందరూ మిగిలిన వారితో పోల్చితే అత్యధిక వేతనాలు పొందుతున్నారు. అయితే వీరి విధి నిర్వహణలో పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. ఏఐ అక్షరాస్యత, వాటాదారుల నిర్వహణ, ప్రాసెస్ అప్లికేషన్, గో టు మార్కెట్ తదితర వాటిని సమర్థంగా నిర్వమించాలి. ఈ నైపుణ్యాలను పెంచుకుంటే ఉద్యోగంలో ఉన్నత స్థాయిలో ఉండడంతో పాటు అత్యధిక వేతనం పొందవచ్చు.

సాధారణంగా కంపెనీల యజమానులు తమ ఉద్యోగుల నుంచి కొన్ని నైపుణ్యాలను కోరుకుంటారని ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది. అవి ఉంటే అత్యధిక వేతనం ఇవ్వడానికి సిద్ధపడతారు. వాటిలో ఏఐ నైపుణ్యాలు, సంఘర్షణ పరిష్కారం, అనుకూలత, వర్క్ ఫ్లో ఆప్టిమైజేషన్, వినూత్న ఆలోచన, పబ్లిక్ స్పీకింగ్ ఉంటాయి. వీటితో పాటు కస్టమర్ ఎంగేజ్ మెంట్, స్టాక్ హోల్డర్ నిర్వహణ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎంలు), వనరుల నిర్వహణ, జీటీఎం స్టార్టజీ తదితర వాటిని కోరుకుంటున్నారు. ప్రపంచంలో ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) శరవేగంగా విస్తరిస్తోంది. అన్ని రకాల సమస్యలకు చిటికెలో పరిష్కారం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఈ టెక్నాలజీని తమ పనికి అనుసంధానించగల నిపుణులకు డిమాండ్ ఎక్కువవుతోంది. సాధారణ అర్హతలతో పాటు ఏఐ నైపుణ్యం ఉన్న వారికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇలాంటి వారికి పనిలో తక్కువ అనుభవం ఉన్నప్పటికీ 47 శాతం అధిక జీతాలు ఇస్తున్నారని ఇటీవల ఒక నివేదిక వెల్లడించింది.

వ్యాపారాలు కొత్త ఉత్పత్తులతో వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ సమయంలో పలు రకాల ఆవిష్కరణలు అవసరమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధ్యతాయుతంగా ఆవిష్కరణలు చేయగల, దీర్థకాలిక విజయాన్ని అందించగల నిపుణుల కోసం కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. కేవలం సాంకేతిక సామర్థ్యమే కాకుండా సాఫ్ట్ స్కిల్స్ కలిగిన ఉద్యోగులకు ఎంతో డిమాండ్ ఉంది. సమర్థంగా చర్చలు జరపడం, విభేదాలను పరిష్కరించడం, వాటాదారులను నిర్వహించడం, ఆలోచనలను స్పష్టంగా కమ్యూనికేట్ చేయడం తదితర నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులకు కంపెనీలు కోరుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

పబ్లిక్ స్పీకింగ్ అనేది కూడా పరిశ్రమ ప్రగతికి కీలకంగా మారుతుంది. నాయకత్వ లక్షణాలు పెంచడానికి, ఉత్పత్తి అమ్మకాల నిర్వహణకు చాలా ఉపయోగపడుతుంది. ఇలా బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలున్న ఫ్రీలాన్సర్లకు కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కాగా.. పరిశ్రమతో సంబంధం లేకుండా టెక్నాలజీ, మార్కెటింగ్, ఫైనాన్స్, కన్సల్టింగ్, డిజైన్ నైపుణ్యాలను పెంచుకోవడం వల్ల ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి.