Abroad Jobs: విదేశీ ఉద్యోగాల మోజులో ఉన్నారా? అసలు నిజాలు చెబుతున్న భారతీయ టెకీ!
యూరోప్‌లో జీవితం చాలా మందికి గొప్ప కల. మెరిసే ఆ ప్రపంచం వెనుక దాగివున్న కొన్ని కఠిన నిజాలను ఓ భారతీయ సాఫ్ట్‌వేర్ డెవలపర్ బయటపెట్టారు. దేవ్ అనే పేరుగల ఈ టెకీ, తాను యూరోప్‌లో ఉంటూ, పని చేస్తూ ఎదుర్కొన్న అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. విదేశాలకు వెళ్లాలని అనుకునేవారు మరోసారి ఆలోచించుకోవాలని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ఆయన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

యూరోప్ లో జీవితం అంటే ఓ గొప్ప కలగా చాలామంది భావిస్తారు. ఆ మెరిసే ప్రపంచం వెనుక దాగివున్న కఠిన వాస్తవాలను ఓ భారతీయ సాఫ్ట్‌వేర్ డెవలపర్ బయటపెట్టారు. దేవ్ అనే ఈ టెకీ, తాను యూరోప్‌లో నివసిస్తూ, పని చేస్తూ ఎదుర్కొన్న అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. విదేశాలకు వెళ్లాలనుకునేవారు మరోసారి ఆలోచించుకోవాలని ఆయన హెచ్చరించారు.
పని అనుమతులు, అధిక పన్నులు..
విదేశాల్లో ఉద్యోగం అంటే కేవలం ఆదాయం కాదు, కొన్ని నిబంధనలుంటాయి. దేవ్ చెప్పినదాని ప్రకారం, పని అనుమతిపై ఉండి ఉద్యోగం కోల్పోతే, వారం లోపు కొత్త పని వెతుక్కోవాలి లేదంటే దేశం విడిచి వెళ్ళిపోవాలి. ఎంత కాలం పని చేశాం, ఎంత పన్ను కట్టాం అనేవి అక్కడ ముఖ్యం కాదు, కేవలం ఉద్యోగం మాత్రమే దేశంలో నివాసానికి ఆధారం. ఆదాయంలో 30-50 శాతం పన్నులకే పోతుందని దేవ్ వెల్లడించారు. అద్దె, నిత్యావసరాలు వంటి ఖర్చులు కూడా చాలా ఎక్కువ. దీంతో డబ్బు ఆదా చేయడం చాలా కష్టం అంటారు.
ఒంటరితనం, మానసిక ఒత్తిడి
యూరోప్ వాతావరణం కూడా ఓ సవాల్. వేసవిలో 24 గంటలు వెలుతురు ఉంటే, శీతాకాలంలో నాలుగు నెలల పాటు సూర్యరశ్మి కనిపించదు. ఈ కఠిన వాతావరణం, అక్కడి వ్యక్తుల ఒంటరి జీవనం మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. దుకాణాల్లో నెల రోజుల సరుకులు ముందే కొనుక్కుంటారు, కాబట్టి బయట పెద్దగా కలిసే అవకాశం ఉండదు. పండుగల సమయాల్లో ఒంటరిగా గడపడం, భారత్‌లో జరుగుతున్న వేడుకల ఫోటోలు ఫోన్‌లో చూడటం మరింత బాధ కలిగిస్తుంది అంటారు దేవ్. తల్లిదండ్రులతో గడిపే సమయం, స్నేహితులతో సరదాగా ఉండే అవకాశం అక్కడ విలాసవంతమైనవిగా మారతాయి. విదేశాలకు వెళ్లే ముందు ఈ విషయాలన్నీ ఆలోచించుకోవాలి అన్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.




