TGUGCET 2023: తెలంగాణ డిగ్రీ గురుకులాల్లో2023-24 ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

|

Jan 05, 2023 | 7:18 PM

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన, సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీస్లో 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల..

TGUGCET 2023: తెలంగాణ డిగ్రీ గురుకులాల్లో2023-24 ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
TGUGCET 2023
Follow us on

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన, సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీస్లో 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలంగాణ గురుకులం అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీయూజీసెట్‌)-2023 పరీక్షకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా బీఏ, బీబీఏ, బీకాం, బీఎస్సీ (ఇంగ్లిష్ మీడియం)లో ప్రవేశాలు కల్పిస్తారు. డిగ్రీ గురుకులాల్లో ప్రవేశాలు పొందాలంటే.. ప్రస్తుతం ఇంటర్ రెండో ఏడాది చదువుతున్నవారు, 2022 మార్చిలో ఇంటర్‌ పూర్తిచేసినవారు మాత్రమే అర్హులు. ఇంటర్‌లో కనీసం 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులైతేనే ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే విద్యార్ధుల తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లోనైతే రూ.1,50,000లు, పట్టణ ప్రాంతాల్లో రూ.2,00,000 కంటే తక్కువ ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఫిబ్రవరి 5, 2023వ తేదీలోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ప్రతిఒక్కరూ రూ.150లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. టీజీయూజీసెట్‌-2023 ఆధారంగా ఆయా డిగ్రీ గురుకులాల్లో సీటు కేటాయిస్తారు. ప్రవేశ పరీక్ష మార్చి 5న నిర్వహిస్తారు. ఇతర పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ప్రవేశాలు కల్పించే డిగ్రీ గురుకులాలు ఇవే..

  • టీఎస్‌డబ్ల్యూఆర్‌ డిగ్రీ కాలేజీ ఆఫ్‌ ఫిజికల్‌ సైన్సెస్‌ ఫర్‌ ఉమెన్‌(బుద్వేల్‌)
  • టీఎస్‌డబ్ల్యూఆర్‌ డిగ్రీ కాలేజీ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఫర్‌ ఉమెన్‌(మహేంద్ర హిల్స్‌)
  • టీఎస్‌డబ్ల్యూఆర్‌ డిగ్రీ కాలేజీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఫర్‌ ఉమెన్‌ (సంగారెడ్డి)
  • టీఎస్‌డబ్ల్యూఆర్‌ డిగ్రీ కాలేజీ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ ఫర్‌ ఉమెన్‌ (ఇబ్రహీంపట్నం)
  • తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీ ఫర్‌ ఉమెన్‌(సిరిసిల్ల)
  • టీఎస్‌డబ్ల్యూఆర్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజీ ఫర్‌ ఉమెన్‌(భువనగిరి)
  • వీటితోపాటు తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 23, టీఎస్‌ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 15 మహిళా గురుకుల డిగ్రీ కాలేజీలున్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ పరధిలో పురుషులకు 7 రెసిడెన్షియల్‌ కాలేజీలలో కూడా ప్రవేశాలు కల్పిస్తారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.