Layoffs: కొత్తేడాది ఐటీ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్‌.. భారీగా ఉద్యోగులను తొలగిస్తోన్న మరో బడా ఐటీ కంపెనీ..

గడిచిన ఏడాది నవంబర్‌లో ఉద్యోగాల తొలగింపు వార్తలు ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేసిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు తప్పవనే వాదనలు వినిపిస్తోన్న నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డాయి. చిన్నా చితకా కంపెనీలే కాకుండా బడా..

Layoffs: కొత్తేడాది ఐటీ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్‌.. భారీగా ఉద్యోగులను తొలగిస్తోన్న మరో బడా ఐటీ కంపెనీ..
Layoffs
Follow us

|

Updated on: Jan 05, 2023 | 3:29 PM

గడిచిన ఏడాది నవంబర్‌లో ఉద్యోగాల తొలగింపు వార్తలు ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేసిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు తప్పవనే వాదనలు వినిపిస్తోన్న నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డాయి. చిన్నా చితకా కంపెనీలే కాకుండా బడా సాఫ్ట్‌వేర్‌ సంస్థలు సైతం ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదిలా ఉంటే కొత్తేడాదిలోనూ ఉద్యోగుల కొనసాగింపు కొనసాగేలా కనిపిస్తోంది. తాజాగా అమెజాన్‌ ఏకంగా 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన విషం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా మరో దిగ్గజ ఐటీ సంస్థ సేల్‌ఫోర్స్‌ కూడా తమ ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. నివేదికల ప్రకారం సేల్స్‌ఫోర్స్‌ తమ మొత్తం వర్క్‌ ఫోర్స్‌లో ఏకంగా 10 శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు బుధవారం తెలిపింది. అంతేకాకుండా పలు చోట్ల సంస్థ కొన్ని కార్యాలయాలను మూసివేయనున్నట్లు తెలిపింది. ఆర్థికమాంద్యం కారణంగా ఖర్చులను తగ్గించునే నేపథ్యంలోనే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఉద్యోగులను తొలగిస్తున్నట్లు స్వయంగా సేల్స్‌ఫోర్స్‌ సీఈవో మార్క్‌ బెనియోఫ్‌ ఉద్యోగులకు లేఖ పంపినట్లు సమాచారం.

కస్టమర్లు తమ ఖర్చులను తగ్గించుకునేందుకు తీసుకున్న నిర్ణయాలే ఉద్యోగుల తొలగింపునకు కారణమని లేఖలో పేర్కొన్నారు. కరోనా సమయంలో ఆదాయం గణనీయంగా పెరగడంతో సేల్స్‌ఫోర్స్‌ పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకుంది, అయితే ప్రస్తుతం మాంద్యం కారణంతో ఖర్చులు తగ్గించుకోవాల్సిన పరిస్థితి అనివార్యంగా ఏర్పడినట్లు సీఈవో అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే తొలగించిన ఉద్యోగులకు సేల్‌ఫోర్స్‌.. ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. ఉద్యోగులకు 5 నెలల జీతంతో పాటు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను కల్పించనున్నట్లు తెలిపింది.

మరిన్ని కెరీర్, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..