Ola Electric: ఓలా సంచలనం.. ఒకేసారి రోడ్డెక్కనున్న 10,000 ఎలక్ట్రిక్ వాహనాలు..
త్వరలో 10,000ఎలక్ట్రిక్ క్యాబ్ లను ఒకేసారి మార్కెట్ లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇది భారతదేశం క్యాబ్ పరిశ్రమలో ఓ విప్లవంగా ఆ కంపెనీ పేర్కొంది. ఈ కార్లను తమ టాప్ రేటెడ్ డ్రైవర్లు నడుపుతారని వివరించింది.
క్యాబ్ వ్యవస్థలో అగ్రగామిగా కొనసాగుతున్న ఓలా తన క్యాబ్ లను ఎలక్ట్రిఫై చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. త్వరలో 10,000ఎలక్ట్రిక్ క్యాబ్ లను ఒకేసారి మార్కెట్ లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇది భారతదేశం క్యాబ్ పరిశ్రమలో ఓ విప్లవంగా ఆ కంపెనీ పేర్కొంది. ఈ కార్లను తమ టాప్ రేటెడ్ డ్రైవర్లు నడుపుతారని వివరించింది. ఈ క్యాబ్ లలో 100 శాతం రైడ్ హామీ, 100 శాతం నగదు రహిత చెల్లింపులు, జీరో క్యాన్సిలేషన్ చార్జీలు ఉంటాయని వివరించింది.
ఇది రెండో సారి..
ఓలా కంపెనీ తన ఈవీ వెహికల్స్ ను పెద్ద ఎత్తున మార్కెట్ లోకి విడుదల చేసేందుకు గతంలో కూడా ఒకసారి ప్రయత్నిచింది. అయితే కొన్ని అనివార్యకారణాల వల్ల దానిని నిలిపివేసింది. ఇప్పుడు మరోసారి దానిని ప్రకటించింది. కాగా బ్లూ స్మార్ట్ అనే క్యాబ్ కంపెనీ భారతదేశంలో అతి పెద్ద ఈవీ రైడ్ హెయిలింగ్ ప్లేయర్ గా ఉంది. దేశ వ్యాప్తంగా ఈ కంపెనీకి చెందిన 3000 ఎలక్ట్రిక్ కార్లు మార్కట్లో ఉన్నాయి. ఇది తయరీ దారుల నుంచి డైరెక్ట్ గా లీజుకు తీసుకుని డ్రైవర్లను నియమిస్తుంది. ఓలా ప్రధాన ప్రత్యర్థి ఉబెర్ కూడా ఢిల్లీ-NCRలోని కొన్ని ప్రాంతాల్లో ఇదే విధమైన సేవను ప్రయోగాత్మకంగా నిర్వహిస్తోంది. ముందుగా బెంగళూరులో 1,000 కార్లను విడుదల చేస్తామని, అక్కడి నుంచి స్కేల్ చేస్తామని కంపెనీ తెలిపింది.
పెద్ద అడుగు వేస్తున్నాం..
ఈ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు, CEO భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ ఈవీ వాహన రంగంలో తాము ఓ పెద్ద అడుగు వే స్తున్నామని చెప్పారు. ఇది ఎలక్ట్రిక్ క్యాబ్ ల రంగంలో ఓ విప్లవాన్ని తీసుకొస్తుందని పేర్కొన్నారు. కాలుష్య రహిత, పర్యావరణ హిత ప్రయాణాన్ని వినియోగదారులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అలాగే వచ్చే 12 నెలల్లో మరో 10, 000 ఎలక్ట్రిక్ ఆటోలకు కూడా మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నామన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..