Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fixed Deposit: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసే ఆలోచనలో ఉన్నారా.? అధికంగా వడ్డీ రేట్లు అందించే బ్యాంకులపై ఓ లుక్కేయండి..

అయితే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఫిక్స్ డ్ డిపాజిట్ ఎప్పుడూ ఉత్తమమైన పొదుపు మార్గం అని నిపుణులు చెబుతుంటారు. సాధారణంగా బ్యాంకులు ఎఫ్ డీ ఖాతాలపై 7.0 శాతం నుంచి  వడ్డీని అందిస్తాయి. అయితే ఏ బ్యాంకులు అత్యధిక వడ్డీ ఇస్తాయి?

Fixed Deposit: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసే ఆలోచనలో ఉన్నారా.? అధికంగా వడ్డీ రేట్లు అందించే బ్యాంకులపై ఓ లుక్కేయండి..
Fixed Deposit rates
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 05, 2023 | 5:34 PM

ప్రస్తుత వాతావరణం, ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక మాంద్యం భయాలు, ఎప్పుడు ఉద్యోగాలు ఉంటాయో.. ఎప్పుడు ఊడతాయో తెలియని ఆందోళనకర పరిస్థితుల్లో అందరు తగినంత మొత్తంలో పొదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ పథకం బెస్ట్ ఆప్షన్ అనేది వెతుకుతున్నారు. దేనిలో ఎక్కువ వడ్డీ వస్తుందా అని ఆలోచిస్తున్నారు. అయితే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఫిక్స్ డ్ డిపాజిట్ ఎప్పుడూ ఉత్తమమైన పొదుపు మార్గం అని నిపుణులు చెబుతుంటారు. సాధారణంగా బ్యాంకులు ఎఫ్ డీ ఖాతాలపై 7.0 శాతం నుంచి  వడ్డీని అందిస్తాయి. అయితే ఏ బ్యాంకులు అత్యధిక వడ్డీ ఇస్తాయి? వాటిల్లో టాప్ త్రీ ఎంటో చూద్దాం..

పంజాబ్ నేషనల్ బ్యాంక్..

ప్రభుత్వ బ్యాంకుల్లో 8% కంటే ఎక్కువ వడ్డీ రేటును అందించే బ్యాంకు ఏదీ లేదు. కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంకు( PNB) సూపర్ సీనియర్ సిటిజన్ల 666 రోజుల ఫిక్స్ డ్ డిపాజిట్‌పై 8.05% వడ్డీ రేటును అందిస్తోంది. అదే కాల పరిమితికి సీనియర్ సిటిజన్‌లకు 7.75% వడ్డీ రేటును ఇస్తోంది. రెగ్యులర్ ఫిక్స్ డ్ డిపాజిట్లపై మాత్రం 7.25% వడ్డీ రేటును అందిస్తోంది. ఇది కూడా తక్కువ ఏమి కాదు. అయితే ఈ ఎఫ్‌డీలతో ఉన్న ఏకైక సమస్య ఏమిటంటే, మెచ్యూరిటీ పిరియడ్ కేవలం 666 రోజులు మాత్రమే. వచ్చే 1-2 సంవత్సరాలలో వడ్డీ రేట్లు తగ్గితే దీనిలో మార్పు కనిపించే అవకాశం ఉంది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..

3 సంవత్సరాల కాలవ్యవధితో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే రేట్లు ఉత్తమమైనవి. 3 సంవత్సరాల కాల పరిమితితో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.30% వడ్డీ రేటు అందిస్తుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెజారిటీ వాటాదారుగా భారత ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఇది చాలా సురక్షితం. అదే మీరు ఈ బ్యాంక్‌లో 700 రోజుల కాలవ్యవధితో డిపాజిట్ చేస్తే వడ్డీ రేటు 7.25% ఉంటుంది. అయితే వచ్చే 1-2 సంవత్సరాల్లో వడ్డీ తగ్గే అవకాశం ఉన్నందున మూడేళ్ల కాలపరిమితితో ఖాతా తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

IDFC ఫస్ట్ బ్యాంక్..

ఆకర్షణీయమైన డిపాజిట్ రేట్లు ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఐడీఎఫ్సీ ఫస్ట్ ఒకటి. కొంచెం ఎక్కువ కాల పరిమితితో తీసుకుంటే ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. 18 నెలల-1 రోజు నుండి 3 సంవత్సరాల డిపాజిట్ పై సాధారణ పౌరులకు 7.5% , సీనియర్ సిటిజన్లకు 8% వడ్డీ రేటును ఈ బ్యాంకు అందిస్తుంది. ఇక్కడ రూ. 5 లక్షల వరకు డిపాజిట్లపై బీమా సౌకర్యం కూడా ఉంటుంది. 2-3 సంవత్సరాల కాలపరిమితితో ఫిక్స్ చేయాలని భావిస్తే ఈ బ్యాంకు మంచి ఆప్షన్.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..