AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇన్-సర్వీస్ టీచర్లకు ‘TET 2026’ పరీక్షల షెడ్యూల్ విడుదల.. టైమింగ్స్ ఇవే

TGTET ఇన్‌ సర్వీస్‌ 2026 పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. సెప్టెంబర్‌ 8, 9 తేదీల్లో మూడు సెషన్లలో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 24,983 మంది ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు పరీక్షలకు హాజరుకానున్నారు. పేపర్‌-1, పేపర్‌-2 పరీక్షల తేదీలు, సమయాలు, పరీక్షా కేంద్రాల పూర్తి వివరాలను విద్యాశాఖ ప్రకటించింది..

ఇన్-సర్వీస్ టీచర్లకు 'TET 2026' పరీక్షల షెడ్యూల్ విడుదల.. టైమింగ్స్ ఇవే
TET In-Service Exam Schedule
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Aug 29, 2026 | 3:28 PM

Share

హైదరాబాద్, ఆగస్ట్‌ 29: తెలంగాణలో పాఠశాల ఉపాధ్యాయుల కోసం నిర్వహించే TGTET ఇన్ సర్వీస్ 2026 పరీక్షలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష TET టైమ్‌టేబుల్‌ను అధికారికంగా ఖరారు చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ మరియు TGTET చైర్‌పర్సన్ అధికారిక పరీక్షల షెడ్యూల్‌ వివరాలను వెల్లడించారు.

తాజా షెడ్యూల్ ప్రకారం, సెప్టెంబర్ 8 మరియు సెప్టెంబర్ 9, 2026 తేదీల్లో మొత్తం మూడు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెషన్ ఉదయం 9.00 గంటల నుండి 11.30 గంటల వరకు, అలాగే రెండవ సెషన్ మధ్యాహ్నం 2.00 గంటల నుండి 4.30 గంటల వరకు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల పరిధిలోని ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలకు సంబంధించిన పూర్తిస్థాయి టైమ్‌టేబుల్ మరియు హాల్ టికెట్ల వివరాలను విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచినట్లు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24,983 మంది ఇన్-సర్వీస్ టీచర్లు హాజరుకానున్నారు. సెప్టెంబర్ 8వ తేదీన ఉదయం షిఫ్ట్‌లో తెలుగు, హిందీ, కన్నడ, ఉర్దూ, మరాఠీ మీడియంలకు చెందిన పేపర్-1 పరీక్షను 23 కేంద్రాల్లో 5,963 మంది అభ్యర్థులకు నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం షిఫ్ట్‌లో ఇంగ్లీష్, తెలుగు మీడియంల పేపర్-2 (మ్యాథ్స్, సైన్స్ & సోషల్) పరీక్షను 42 కేంద్రాల్లో అత్యధికంగా 15,071 మంది రాయనున్నారు. ఇక చివరిగా సెప్టెంబర్ 9వ తేదీన మధ్యాహ్నం షిఫ్ట్‌లో హిందీ, కన్నడ, ఉర్దూ, మరాఠీ, సంస్కృతం మీడియంల పేపర్-2 పరీక్షను 16 కేంద్రాల్లో 3,949 మంది అభ్యర్థులకు నిర్వహించేలా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

Follow Us