AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Govt Jobs 2026: ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో AEE ఉద్యోగాలు.. ఇంజినీరింగ్‌ డిగ్రీతో దరఖాస్తు చేసుకోండి

రాష్ట్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులో అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌ (AEE) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 40 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనుంది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు..

AP Govt Jobs 2026: ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో AEE ఉద్యోగాలు.. ఇంజినీరింగ్‌ డిగ్రీతో దరఖాస్తు చేసుకోండి
APPSC Pollution Control Board Recruitment
Srilakshmi C
|

Updated on: Sep 18, 2026 | 12:33 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులో అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌ (AEE) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 40 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనుంది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకంలో అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌ (AEE) – 40 పోస్టులు ఉన్నాయి.

ఈ పోస్టుకలు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టుకు సంబంధించిన పూర్తి విద్యార్హతలు, ఇతర నిబంధనలను అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి. అర్హత కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 27, 2026వ తేదీ రాత్రి రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. AEE పోస్టులకు సింగిల్‌ లెవెల్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ రాత పరీక్ష (CBRT) నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ, పేపర్‌ 2 కామన్‌ సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 1/3వంతు నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. రాత పరీక్షతో పాటు అభ్యర్థులు కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ (CPT) లో కూడా అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈ నియామకానికి స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఉండదు. ఎంపికైన వారికి నెలకు రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు జీతంగా అందిస్తారు.

ముఖ్యమైన వివరాలు

పోస్టు: అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌ (AEE) మొత్తం ఖాళీలు: 40 అర్హత: సంబంధిత ఇంజినీరింగ్‌ డిగ్రీ వేతనం: రూ.57,100 – రూ.1,47,760 ఎంపిక: CBRT + CPT నెగెటివ్‌ మార్కింగ్‌: 1/3 స్క్రీనింగ్‌ టెస్ట్: లేదు దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్ 6, 2026. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 27, 2026.

ఇవి కూడా చదవండి

ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us