తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలెర్ట్.. TG EAPCET దరఖాస్తుల స్వీకరణ వాయిదా.. పూర్తి వివరాలివే..

TG EAPCET 2025 Applications: తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న టీజీ ఎప్‌సెట్ (TG EAPCET-2025) దరఖాస్తు ప్రక్రియ వాయిదా పడింది.. వాస్తవానికి ఈరోజు (ఫిబ్రవరి 25) నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది..

తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలెర్ట్.. TG EAPCET దరఖాస్తుల స్వీకరణ వాయిదా.. పూర్తి వివరాలివే..
TG EAPCET 2025 Notification

Edited By:

Updated on: Feb 25, 2025 | 5:12 PM

TG EAPCET 2025 Applications: తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న టీజీ ఎప్‌సెట్ (TG EAPCET-2025) దరఖాస్తు ప్రక్రియ వాయిదా పడింది.. వాస్తవానికి ఈరోజు (ఫిబ్రవరి 25) నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.. ఈ క్రమంలోనే సాంకేతిక కారణాలతో దరఖాస్తుల ప్రక్రియను వాయిదా వేసినట్లు ఎప్‌సెట్ క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ డీన్ కుమార్ మంగళవారం ప్రకటించారు. తెలంగాణలో నేటి నుంచి ప్రారంభం కావాల్సిన TG EAPCET ప్రవేశ పరీక్ష దరఖాస్తుల స్వీకరణ వాయిదా పడిందని.. మార్చి 1 నుంచి అప్లికేషన్స్ తీసుకోనున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటనలో తెలిపింది.. ఇక ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్‌ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎప్‌సెట్ క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ డీన్ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

కాగా.. ఆన్‌లైన్‌ దరఖాస్తుల నేపథ్యంలో విద్యార్థుల సందేహాల నివృత్తికి జేఎన్టీయూ రెండు హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసింది. విద్యార్థులు వివరాల కోసం 74169 23578, 74169 08215 ఈ నంబర్లను సంప్రదించవచ్చని ఎప్‌ఎట్‌ కన్వీనర్‌ వెల్లడించారు. ఇంటర్ పూర్తై ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం EAPCET పరీక్షను విద్యార్థులు రాయనున్నారు

EAPCET షెడ్యుల్ ఇలా..

నోటిఫికేషన్ విడుదల : 20-02-2025

అప్లికేషన్ల స్వీకరణ : మార్చి 1 నుంచి ఏప్రిల్ 4 వరకు అప్లికేషన్స్ స్వీకరణ

అగ్రికల్చర్ & ఫార్మసీ పరీక్ష తేదీలు: ఏప్రిల్ 29,30

ఇంజినీరింగ్ పరీక్ష తేదీలు: మే 2, 3, 4, 5

జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో జరిగే EAPCET పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 20న విడుదల అయింది. ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు తీసుకోనున్నట్లు ప్రకటించారు. మంగళవారం నుంచి దరఖాస్తులు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలతో వాయిదా వేసినట్లు EAPCET కన్వీనర్ తెలిపారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..