TS Inter Supply Results 2025: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి

TS Inter Supply Results 2025 Declared: రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షలకుపైగా ఇంటర్మీడియట్ విద్యార్ధులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల కోసం నెల రోజులకు పైగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వీరి నిరీక్షణకు తెరదించుతూ ఇంటర్ బోర్డు సోమవారం (జూన్ 16) సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసింది. విద్యార్ధులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా నేరుగా మార్కుల మెమోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు..

TS Inter Supply Results 2025: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి
Telangana Inter Supply Results

Updated on: Jun 16, 2025 | 1:13 PM

హైదరాబాద్‌, జూన్‌ 16: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు సోమవారం (జూన్ 16) విడుదలయ్యాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్ధులతోపాటు మార్కులను పెంచుకోవడానికి ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు రాసిన వారికి కూడా ఫలితాలను వెల్లడించారు. అధికారిక వెబ్‌సైట్‌ tgbie.cgg.gov.in  లేదా results.cgg.gov.inలలో విద్యార్ధులు తమ హాల్‌ టికెట్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. అలాగే టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లోనూ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 ఇక్కడ చెక్ చేసుకోండి.

సబ్జెక్ట్‌ వైజ్‌ విద్యార్ధుల మార్కుల వివరాలు బోర్డు అధికారులు అందుబాటులో ఉంచారు. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షలు రాసిన విద్యార్ధులు తమ హాల్‌ టికెట్‌ నంబర్ ఎంటర్‌ చేసి మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తాజా ఫలితాల్లో ఫస్ట్ ఇయర్ లో 67.4 శాతం, సెకండ్ ఇయర్ లో 50.82 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

ఇవి కూడా చదవండి

కాగా ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,12,724 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఫస్ట్‌ ఇయర్‌ జనరల్‌లో 2,49,204 మంది, ఒకేషనల్‌లో 17,003 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక సెకండ్ ఇయర్‌ జనరల్‌లో 1,34,988 మంది, ఒకేషనల్‌లో 12,402 మంది విద్యార్థులు ఉన్నారు. మే 22 నుంచి మే 29వ తేదీ వరకు రోజుకు రెండు విడతల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.