TS High Court Jobs: తెలంగాణ హైకోర్ట్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్ పోస్టులు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం, అర్హులు ఎవరంటే..

Narender Vaitla

Narender Vaitla |

Updated on: Jan 14, 2023 | 10:12 AM

తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్‌లు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన హైకోర్ట్ తాజాగా కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను..

TS High Court Jobs: తెలంగాణ హైకోర్ట్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్ పోస్టులు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం, అర్హులు ఎవరంటే..
Ts High Court Jobs

తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్‌లు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన హైకోర్ట్ తాజాగా కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్(నం.03/2023) జారీ చేసింది. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 20 కంప్యూటర్ ఆపరేటర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బ్యాచిలర్‌ డిగ్రీ(ఆర్ట్స్‌/ సైన్స్‌/ లా) లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఇంగ్లిష్‌ హయ్యర్‌ గ్రేడ్‌ టైప్‌రైటింగ్‌, పీజీ డిప్లొమా(కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌) లేదా బీసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థుల వయసు 11-01-2023 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ట్రైబల్/ బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను కంప్యూటర్ బేస్‌డ్‌ టెస్ట్‌, టైపింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన వారికి నెలకు రూ. 38,890 నుంచి రూ.1,12,510 వరకు చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ 21-01-2023 నుంచి ప్రారంభవుతుండగా 11-02-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.

* హాల్‌ టికెట్లను 20-02-2023 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్షను మార్చిలో నిర్వహిస్తారు.

* నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu