AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం.. ఇక సర్కార్ బడి టీచర్లకు డబుల్ బెనిఫిట్స్

రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మాత్రమే అందుతున్న ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని ఇకపై ఉపాధ్యాయులు, లెక్చరర్లు, బోధనేతర సిబ్బందికీ విస్తరించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ-కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది..

తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం.. ఇక సర్కార్ బడి టీచర్లకు డబుల్ బెనిఫిట్స్
TG Free Breakfast Scheme
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Jul 02, 2026 | 7:43 PM

Share

హైదరాబాద్, జులై 2: తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగంలో మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే అందుతున్న ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజన సదుపాయాన్ని ఇకపై ఉపాధ్యాయులు, లెక్చరర్లు, బోధనేతర సిబ్బందికీ విస్తరించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన తొలి ఈ-కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులు పోషకాహార లోపానికి గురికాకుండా ఉండేందుకు చాలా కాలంగా మధ్యాహ్న భోజన పథకం అమలులో ఉంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అల్పాహార పథకాన్ని కూడా ప్రవేశపెట్టగా, ఈ విద్యా సంవత్సరం నుంచి జూనియర్ కళాశాలల విద్యార్థులకూ అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు అదే సదుపాయాన్ని విద్యార్థులకు బోధించే సిబ్బందికీ వర్తింపజేయాలని నిర్ణయించడం విశేషంగా మారింది.

ఇవి కూడా చదవండి

ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఇతర సిబ్బందికి ప్రతిరోజూ ఉచితంగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించనున్నారు. దీంతో విద్యాసంస్థల్లో సిబ్బంది ఎక్కువ సమయం అందుబాటులో ఉండటంతో పాటు విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు స్వాగతిస్తున్నాయి. విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయుల సంక్షేమానికి ఇది దోహదపడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

Follow Us
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక ప్రభుత్వ బడి టీచర్లకు పండగే
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక ప్రభుత్వ బడి టీచర్లకు పండగే
కేరళలో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ..OTTలో మెంటలెక్కిస్తోన్న సినిమా
కేరళలో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ..OTTలో మెంటలెక్కిస్తోన్న సినిమా
అయ్యో.. ఇలాంటోళ్ల మధ్యనా మనం బతుకుతున్నాం..? వృద్ధురాలి నగలపై..
అయ్యో.. ఇలాంటోళ్ల మధ్యనా మనం బతుకుతున్నాం..? వృద్ధురాలి నగలపై..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీ జీతంతో TGPSC మరో నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీ జీతంతో TGPSC మరో నోటిఫికేషన్‌
వాషింగ్ మెషీన్ కొనేముందు వీటి మధ్య తేడా ఏంటో తెలుసుకోండి..
వాషింగ్ మెషీన్ కొనేముందు వీటి మధ్య తేడా ఏంటో తెలుసుకోండి..
అదృష్టం అంటే మీదే భయ్యా..! ఈ రాశుల వారికి ఇక తిరుగుండదు
అదృష్టం అంటే మీదే భయ్యా..! ఈ రాశుల వారికి ఇక తిరుగుండదు
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలపై ప్రభుత్వం సూపర్ న్యూస్
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలపై ప్రభుత్వం సూపర్ న్యూస్
ఆవకాయ తర్వాత అంత క్రేజ్ ఉన్న పచ్చడి ఇదే.. రుచిలో మాత్రం రాజీ లేదు
ఆవకాయ తర్వాత అంత క్రేజ్ ఉన్న పచ్చడి ఇదే.. రుచిలో మాత్రం రాజీ లేదు
హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం అప్డేట్
హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం అప్డేట్
నాడు గన్.. నేడు నాగలి.. వ్యవసాయం పనుల్లో మహిళా మావోయిస్టు
నాడు గన్.. నేడు నాగలి.. వ్యవసాయం పనుల్లో మహిళా మావోయిస్టు