TS EAMCET 2022: తెలంగాణ ఎంసెట్‌ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. సప్లిమెంటరీ ఫలితాల నేపథ్యంలో కీలక నిర్ణయం..

|

Aug 30, 2022 | 1:16 PM

TS EAMCET 2022: ఇంటర్‌ సెకండ్ ఇయర్‌ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్‌ అర్హత సాధించి..

TS EAMCET 2022: తెలంగాణ ఎంసెట్‌ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. సప్లిమెంటరీ ఫలితాల నేపథ్యంలో కీలక నిర్ణయం..
Ts Eamcet 2022
Follow us on

TS EAMCET 2022: ఇంటర్‌ సెకండ్ ఇయర్‌ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్‌ అర్హత సాధించి, సెకండ్ ఇయర్‌ సప్లిమెంటరీ పరీక్ష రాసిన వారి కోసం ఇంజనీరింగ్ కౌన్సెలింగ్లో పలు మార్పులు చేసినట్లు ప్రకటించారు. ఇంటర్‌ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారి కోసం సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ స్లాట్‌ బుకింగ్‌ గడువును పెంచారు. అలాగే వెబ్‌ ఆప్షన్స్‌ ఇంచుకునే గడువును కూడా పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ప్రాసెసింగ్ ఫీజు, స్లాట్‌ బుకింగ్‌ కోసం 01-09-2022ని చివరి తేదీగా నిర్ణయించారు. అలాగే సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ కోసం 02-09-2022 చివరి తేదీ కాగా, వెబ్‌ ఆప్షన్స్‌లో మార్పులు చేసుకోవడానికి 30-09-2022ని చివరి తేదీగా నిర్ణయించారు. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాల విడుదలకు ముందే ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 6న ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సప్లిమెంటరీ రాసిన విద్యార్థులు తొలిదశ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం కల్పించారు అధికారులు. ఇందుకోసమే రిజిస్ట్రేషన్‌, ఆప్షన్ల నమోదు తేదీలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సాంకేతిక విద్యా శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..