సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్‌వీఎన్‌ఐటీ)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో ఉన్న నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 101 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో లైబ్రేరియన్ (01), సైంటిఫిక్ ఆఫీసర్/ టెక్నికల్ ఆఫీసర్ (ఎంఐఎస్) (01), ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్) (02), సూపరింటెండెంట్ (06), జూనియర్ ఇంజినీర్(సివిల్/ ఎలక్ట్రికల్) (07), స్టూడెంట్ యాక్టివిటీ & స్పోర్ట్స్ అసిస్టెంట్ (02), లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ (03), టెక్నికల్ అసిస్టెంట్ (17), ఫార్మసిస్ట్ (01), జూనియర్ అసిస్టెంట్ (15), సీనియర్ అసిస్టెంట్ (08), ఆఫీస్ అటెండెంట్ (17), సీనియర్ టెక్నీషియన్ (13), టెక్నీషియన్ (25) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా 10వ తరగతి, 12వ తరగతి, డిగ్రీ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో పని అనుభవం తప్పనిసరి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు మొదట ఆన్‌లైన్‌లో అప్లై చేసుకొని, తర్వాత హార్డ్ కాపీలను ఆఫ్‌లైన్ విధానంలో పంపించాలి.
* రూ. 500 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 02-12-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* దరఖాస్తు హార్డ్ కాపీలను పోస్టులో 12-12-2022 తేదీలోపు పంపించాలి.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..