SSC JE Recruitment 2022: చివరి అవకాశం! స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపే ఆఖరు..

|

Sep 01, 2022 | 2:45 PM

భారత ప్రభుత్వ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగానికి చెందిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC).. గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ రేపటితో..

SSC JE Recruitment 2022: చివరి అవకాశం! స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపే ఆఖరు..
Ssc
Follow us on

SSC Junior Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగానికి చెందిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC).. గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ రేపటి (సెప్టెంబర్‌ 2)తో ముగియనుంది. సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఆటోమొబైల్‌ స్పెషలైజేషన్‌లో డిప్లొమా లేదా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే జనవరి 1, 2022వ తేదీ నాటికి దరఖాస్తుదారుల వయసు 32 యేళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు రేపు (సెప్టెంబర్‌ 2, 2022) ముగింపు సమయంలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికాలాంగులు/మహిళలు/ఎక్స్-సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

రాత పరీక్ష విధానం: రాత పరీక్ష 2 పేపర్లకు నిర్వహిస్తారు. పేపర్‌-1 ఆన్‌లైన్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ తరహాలో మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలకు ఉంటుంది. 2 గంటల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. పేపర్‌-2 ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. దీనిలో మొత్తం 300 మార్కులకు రెండు గంటల సమయంలో పరీక్ష ఉంటుంది.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.