SSC GD Constable Results 2022: ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ రాత పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి..

|

Apr 09, 2023 | 10:29 AM

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) 50,187 ఉద్యోగాలకు జనరల్‌ డ్యూటీ కానిస్టేబుల్‌ రాత పరీక్ష ఫలితాలు శనివారం (ఏప్రిల్‌ 8) విడుదలయ్యాయి. రాత పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పీఎస్‌టీ/ పీఈటీలను..

SSC GD Constable Results 2022: ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ రాత పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి..
SSC GD Constable Results 2022
Follow us on

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) 50,187 ఉద్యోగాలకు జనరల్‌ డ్యూటీ కానిస్టేబుల్‌ రాత పరీక్ష ఫలితాలు శనివారం (ఏప్రిల్‌ 8) విడుదలయ్యాయి. రాత పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పీఎస్‌టీ/ పీఈటీలను ఏప్రిల్‌ 14 తర్వాత నిర్వహించనున్నట్లు తన ప్రకటనలో వెల్లడించింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్‌) ఇటీవల ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తాత్కాలిక పరీక్ష తేదీలను ప్రకటించింది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు శారీరక సామర్థ్య/ ప్రమాణ పరీక్షలు దేశవ్యాప్తంగా సీఆర్‌పీఎఫ్‌ శిక్షణ కేంద్రాల్లో జరుగనున్నాయి. అడ్మిట్ కార్డు ఎప్పటి నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చనేది త్వరలో వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని తెల్పింది. శారీరక సామర్థ్య పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. తుది ఫలితాల అనంతరం రిజర్వేషన్‌ ఆధారంగా సాయుధ బలగాల్లో ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

కాగా కేంద్ర సాయుధ బలగాల్లో భారీ స్థాయిలో కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టుల భర్తీకి ఎస్‌ఎస్‌సీ ఈ నియామక ప్రక్రియ చేపడుతోంది. బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ); ఎన్‌సీబీలో సిపాయి పోస్టులు భర్తీకి జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎస్‌ఎస్‌సీ ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.