
హైదరాబాద్, నవంబర్ 21: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఆధ్వర్యంలో చేపట్టిన కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఎగ్జామినేషన్ 2025 పోస్టుల భర్తీకి సంబంధించి పేపర్ 2 డిస్క్రిప్టివ్ ఆధారిత పరీక్షల షెడ్యూల్ తాజాగా ఎస్సెస్సీ విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం పేపర్ 2 పరీక్ష డిసెంబర్ 14న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కాగా ఈ ఏడాది ఆగస్టు 12న పేపర్ I పరీక్ష నిర్వహించగా మొత్తం 6,332 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇటీవలే ఈ పేపర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో అర్హత సాధించని వారికి పేపర్ రాసేందుకు అనుమతి ఇస్తారు. మొత్తం 3,642 మంది అభ్యర్ధులకు పేపర్ 2 పరీక్ష రాసేందుకు షార్ట్‌లిస్ట్ అయ్యారు. వీరందరికీ డిసెంబర్ 24వ తేదీన పేపర్ పరీక్ష నిర్వహిస్తారు. కాగా ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 552 గ్రూప్ ‘బి’ నాన్ గేజిటెడ్ పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ పేపర్-2 షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఆధ్వర్యంలో క్లర్క్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ పరీక్షలు గత నెల అక్టోబర్ 4, 5, 11 తేదీల్లో జరిగిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్ రోల్ నంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా ఈ నోటిఫికేషన్ కింద ఐబీపీఎస్ మొత్తం 13,533 ఖాళీలను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.