భారత ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని సైఫాబాద్‌కు చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్.. 83 జూనియర్ టెక్నీషియన్, ఫైర్‌మ్యాన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తు దారుల వయసు జులై 1, 2022వ తేదీలోపు తప్పనిసరిగా 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జులై 2, 1997 నుంచి జులై 1, 2004 మధ్య జన్మించిన వారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 31, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు రూ. 600, ఎస్సీ/ఎస్టీ /పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు రూ.200లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. నవంబర్/డిసెంబర్ 2022లో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
రాత పరీక్ష విధానం..
మొత్తం 150 మార్కులకుగానూ,120 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు రెండు గంటల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉండదు. పరీక్ష ఇంగ్లిస్, హిందీలో మాత్రమే ఉంటుంది.
పార్ట్-1
పార్ట్-2
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.