SECIL Recruitment: కేంద్ర ప్రభుత్వ సంస్థలో అప్రెంటిస్ పోస్టులు.. 1500కిపైగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..
ఇంజనీరింగ్, డిప్లొమా చేసిన ఖాళీగా ఉన్నారా.? మీలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. భారీ ఎత్తున అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర బొగ్గు గనుల శాఖకు చెందిన సౌత్ ఈస్ట్రర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్..
ఇంజనీరింగ్, డిప్లొమా చేసిన ఖాళీగా ఉన్నారా.? మీలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. భారీ ఎత్తున అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర బొగ్గు గనుల శాఖకు చెందిన సౌత్ ఈస్ట్రర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్ఈసీఎల్)లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పలు విభాగాల్లో ఉన్న మొత్తం 1532 ఖాళీలు ఉన్నాయి. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 1532 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో గ్రాడ్యుయేట్ /డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి.
* మైనింగ్/ఎలక్ట్రికల్/మెకానికల్/సివిల్ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ పోస్టులు.. మైనింగ్/మైనింగ్, మైన్ సర్వేయింగ్ విభాగాల్లో డిప్లొమా పోస్టుల భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
* అభ్యర్థుల వయసు 18 ఏళ్లు ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 19-12-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..