KVS Recruitment: నిరుద్యోగులూ గెట్‌ రడీ.. కేంద్రీయ విద్యాలయాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునే వారికి శుభవార్త. కేంద్రీయ విద్యాలయంలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా పలు టీచింగ్, నాన్‌ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పలు విభాగాల్లో ఉన్న 6990 పోస్టులను భర్తీ..

KVS Recruitment: నిరుద్యోగులూ గెట్‌ రడీ.. కేంద్రీయ విద్యాలయాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
Kvs Recruitment
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 03, 2022 | 11:30 AM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునే వారికి శుభవార్త. కేంద్రీయ విద్యాలయంలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా పలు టీచింగ్, నాన్‌ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పలు విభాగాల్లో ఉన్న 6990 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 5వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో బాగంగా మొత్తం 6990 పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అసిస్టెంట్ కమిషనర్ (52), ప్రిన్సిపాల్ (239), వైస్ ప్రిన్సిపాల్ (203), పీజీటీ (1409), టీజీటీ (3176), లైబ్రేరియన్ (355), ప్రైమరీ టీచర్ (303), ఫైనాన్స్ ఆఫీసర్ (6), అసిస్టెంట్ ఇంజనీర్ (2), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (156), హిందీ ట్రాన్స్‌లాటర్ (156), సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (322), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (702), స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II (54) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా ఇంటర్‌/బీఈడీ/పీజీ/మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష/క్లాస్‌ డెమో / ఇంటర్వ్యూ / స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 05-12-2022న మొదలవుతుండగా 26-12-2022తో ముగియనుంది.

* పరీక్ష ఫీజు చెల్లించడానికి 26-12-2022ని చివరి తేదీగా నిర్ణయించనున్నారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..