NHAI Recruitment: బీటెక్‌ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం.. ఎలా ఎంపిక చేస్తారంటే..

నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ సంస్థ ఆధ్వరంలో పనిచేసే నేషనల్‌ హైవే లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌(ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్‌)లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో..

NHAI Recruitment: బీటెక్‌ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం.. ఎలా ఎంపిక చేస్తారంటే..
Nhai Recruitment
Follow us

|

Updated on: Dec 03, 2022 | 9:42 AM

నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ సంస్థ ఆధ్వరంలో పనిచేసే నేషనల్‌ హైవే లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌(ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్‌)లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 29 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వైస్‌ ప్రెసిడెంట్‌, సీనియర్ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్లు వంటి పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* రోప్‌వే, లాజిస్టిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, హైవేస్‌, ఫైనాన్స్‌, స్ట్రాటజీ అండ్‌ అకౌంట్స్‌ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/ బీఈ/ బీటెక్‌/ డిప్లొమా/ ఎంఎస్సీ/ పీజీ/ సీఏ/ సీఎంఏ/ సీఎఫ్‌ఏ/ పీజీడీఎం/ ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను ఈ మెయిల్ విధానంలో పంపించాల్సి ఉంటుంది.

* అప్లికేషన్స్‌ను ravinder.nhlml@nhai.org మెయిల్‌కు పంపించాలి.

* అభ్యర్థులను రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 31-12-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..