NLC Recruitment: ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌లో భారీగా ఉద్యోగాలు.. ఎవరు అర్హులు.? ఎలా ఎంపిక చేస్తారు.?

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎల్‌సీఐఎల్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. తమిళనాడులోని ఈ ప్రభుత్వ కోల్‌ మైనింగ్ సంస్థ పలు విభాగాల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

NLC Recruitment: ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌లో భారీగా ఉద్యోగాలు.. ఎవరు అర్హులు.? ఎలా ఎంపిక చేస్తారు.?
Nlc India Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 03, 2022 | 11:04 AM

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎల్‌సీఐఎల్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. తమిళనాడులోని ఈ ప్రభుత్వ కోల్‌ మైనింగ్ సంస్థ పలు విభాగాల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా 213 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో జూనియర్ ఓవర్‌మ్యాన్ (ట్రైనీ) (51), జూనియర్ సర్వేయర్ (ట్రైనీ) (15), సిర్దార్ (సెలక్షన్ గ్రేడ్-1) (147) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును అనుసరించి డిప్లొమా(మైనింగ్/ మైనింగ్ ఇంజినీరింగ్/ మైన్ సర్వేయింగ్)/ డిగ్రీ(సివిల్) ఉత్తీర్ణతతో పాటు ఓవర్‌మ్యాన్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ, మైనింగ్ సిర్దార్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 01-11-2022 నాటికి 30 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు .

* జేవో, జేఎస్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 31,000 నుంచి రూ. 100000, సిర్దార్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 26,000 నుంచి రూ. 1,10,000 వరకు చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు గడువు 30-12-2022తో ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..