SEBI Recruitment: సెబీలో ఉద్యోగాలు.. నెల‌కు రూ. 60 వేల జీతం.. ద‌ర‌ఖాస్తుల‌కు ద‌గ్గ‌ర‌ప‌డుతోన్న గ‌డువు..

|

Jan 22, 2022 | 6:40 PM

SEBI Recruitment: సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంఛ్ బోర్డ్ ఆప్ ఇండియా (SEBI) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో భాగంగా ప‌లు విభాగాల్లో ఉన్న ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు...

SEBI Recruitment: సెబీలో ఉద్యోగాలు.. నెల‌కు రూ. 60 వేల జీతం.. ద‌ర‌ఖాస్తుల‌కు ద‌గ్గ‌ర‌ప‌డుతోన్న గ‌డువు..
Follow us on

SEBI Recruitment: సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంఛ్ బోర్డ్ ఆప్ ఇండియా (SEBI) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో భాగంగా ప‌లు విభాగాల్లో ఉన్న ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. నిర్ణీత కాల వ్య‌వ‌ధితో తీసుకోనున్న ఈ నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, రీసెర్చ్‌,లా, సెక్యూరిటీస్ మార్కెట్ ఆప‌రేష‌న్స్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ముంబ‌యిలోని కార్యాల‌యంలో పనిచేయాల్సి ఉంటుంది.

* సెక్యూరిటీస్ మార్కెట్ ఆప‌రేష‌న్స్ పోస్టుల‌కు ద‌రఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు చార్టెడ్ అకౌంటెంట్ మూడేళ్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే సంబంధిత విభాగంలో క‌నీసం ఏడాది అనుభ‌వం ఉండాలి.

* లా విభాగంలో ఉన్న ఖాళీల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు క‌నీసం 60 శాతం మార్కుల‌తో లాలో బ్యాచిల‌ర్ డిగ్రీ లేదా మాస్ట‌ర్ ఆఫ్ లాను పూర్తి చేసి ఉండాలి. ఏడాది అనుభం త‌ప్ప‌నిస‌రి.

* రీసెర్చ్ విభాగంలో ఉన్న పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు కార్పొరేట్ ఫైనాన్స్‌, ఫైనాన్షియ‌ల్ మార్కెట్ విభాగంలో క‌నీసం ఏడాది అనుభ‌వం ఉండాలి. పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి అనుభ‌వం అవ‌స‌రం లేదు.

* ఐటీ విభాగంలో ఖాళీల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు బీటెక్ పూర్తి చేసి ఉండాలి. అంతేకాకుండా సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ లేదా సైబ‌ర్ సెక్యూరిటీ విభాగంలో ప‌ని అనుభ‌వం త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థుల‌ను ముందుగా ప‌ని అనుభవం, విద్యార్హ‌త‌ల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంత‌రం ఇంట‌ర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ఎంపికైన అభ్య‌ర్థులకు నెల‌కు రూ. 60 వేలు జీతంగా అందిస్తారు.

* మొద‌ట అభ్య‌ర్థుల‌ను ఏడాది పాటు కాంట్రాక్ట్ విధానంలో తీసుకుంటారు. అనంత‌రం గ‌రిష్టంగా మూడేళ్లు పొడ‌గిస్తారు.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు చివ‌రి తేదీగా 25-01-2022గా నిర్ణ‌యించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Indian Navy: ఇంటర్ పూర్తి చేసిన వారికి ఇండియ‌న్ నేవీ ఆహ్వానం.. బీటెక్ డిగ్రీతో పాటు ఉద్యోగం..

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఇండియన్‌ ఆర్మీ నుంచి నోటిఫికేషన్.. టెన్త్‌, ఇంటర్ అర్హత..

EDCIL Recruitment: ప‌దో త‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు..