
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో.. 94 టెక్నీషియన్, టెక్నీషియన్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సినిమాటోగ్రఫీ/ ఫొటోగ్రఫీ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కెమికల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ప్లంబర్, ఆపరేటర్ కమ్ మెకానిక్, హెచ్‌వీడీ లైసెన్స్‌డ్ డీజిల్ మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, సివిల్, మెకానికల్ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ/ ఎన్‌టీసీ/ ఎన్‌ఏసీ, డిప్లొమా, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో మే 16, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.600ల నుంచి రూప1000ల వరకు ఆయా పోస్టులను బట్టి చెల్లించాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు టెక్నికల్ అసిస్టెంట్/ సైంటిఫిక్ అసిస్టెంట్/ లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులకు రూ.44,900ల నుంచి రూ.1,42,400ల వరకు జీతంగా చెల్లిస్తారు. టెక్నీషియన్/ డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టులకు రూ.21,700ల నుంచి 69,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.