SBI Recruitment: ఎస్‌బీఐలో 1031 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. వారు మాత్రమే అర్హులు.
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 1031 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా ఛానల్ మేనేజర్ ఫెసిలిటేటర్, ఛానల్ మేనేజర్ సూపర్‌వైజర్, సపోర్ట్ ఉద్యోగాలను..
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 1031 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా ఛానల్ మేనేజర్ ఫెసిలిటేటర్, ఛానల్ మేనేజర్ సూపర్‌వైజర్, సపోర్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయితే ఈ పోస్టులకు కేవలం రిటైర్డ్ ఉద్యోగులు మాత్రమే అర్హులు. రిటైర్డ్ అయిన బ్యాంకు ఉద్యోగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
రిటైర్డ్ బ్యాంకు సిబ్బందిని కాంట్రాక్ట్ విధానంలో నియమించుకోనున్నారు. గతంలో బ్యాంకుల్లో పనిచేసిన అనుభవం ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 30వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారి వయసు కనీసం 60 ఏళ్లు, గరిష్టంగా 63 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్లకు లోబడి వయసులో సడలింపు ఉంటుంది. దేశంలో ఏ బ్రాంచులో ఉద్యోగం కేటాయించిన పని చేయాల్సి ఉంటుంది. ఏటీఎం ఆపరేషన్స్‌లో పనిచేసిన అనుభవం కలిగినవారికి ఎక్కువ ప్రాధాన్యం కల్పిస్తారు. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వేతనాల విషయానికొస్తే.. ఛానెల్ మేనేజర్ ఫెసిలిటేటర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 36,000, ఛానెల్ మేనేజర్ సూపర్‌వైజర్ పోస్టులకు రూ. 41,000, సపోర్ట్ ఆఫీసర్ పోస్టులకు నెలకు రూ. 41,000 జీతంగా చెల్లిస్తారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..