SAIL Recruitment: కేంద్ర ప్రభుత్వ సంస్థలో అప్రెంటిస్ పోస్టులు.. మెరిట్ ఆధారంగా ఎంపిక.
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటటిఫికేషన్ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన ఇస్కో స్టీల్ ప్లాంట్ బర్నపూర్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా ట్రేడ్ అప్రెంటిస్...
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటటిఫికేషన్ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన ఇస్కో స్టీల్ ప్లాంట్ బర్నపూర్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 239 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ఎలక్ట్రిషియన్ (65), ఫిట్టర్ (57), రిగ్గర్ (18), టర్నర్ (12), మెషినిస్ట్ (15), వెల్డర్ (32), కంప్యూటర్/ఐసీటీఎస్ఎం (6), ఆర్ఈఎఫ్ అండ్ ఏసీ (16), మెకానిక్ మోటార్ వెహికల్ (5), ప్లంబర్ (6), డ్రాఫ్ట్స్ మ్యాన్ (సివిల్) (7) పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చల్చించాల్సిన అవసరం లేదు.
* అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన వారికి నెలకు రూ. 7000 నుంచి రూ. 7.700 స్టైపెండ్ చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 29ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..