AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB RPF 2025 Exam Dates: ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ రాత పరీక్ష తేదీలివే.. మరో వారంలో అడ్మిట్‌ కార్డులు

దేశవ్యాప్తంగా ఉన్న పలు రైల్వే రీజియన్లలో రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (RPF), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్‌ఎఫ్‌) కానిస్టేబుల్‌ నియామకాలకు సంబంధించి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు కీలక అప్‌డేట్‌ వెలువరించింది. ఇప్పటికే ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ పూర్తి కాగా రాత పరీక్ష తేదీలు తాజాగా వెల్లడించింది. అంతేకాకుండా..

RRB RPF 2025 Exam Dates: ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ రాత పరీక్ష తేదీలివే.. మరో వారంలో అడ్మిట్‌ కార్డులు
RRB RPF 2025 Exam Dates
Srilakshmi C
|

Updated on: Mar 02, 2025 | 6:29 AM

Share

హైదరాబాద్, ఫిబ్రవరి 24: రైల్వే శాఖ ఆధ్వర్యంలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు(ఆర్‌పీఎఫ్‌), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్‌ఎఫ్‌) పరీక్షలు వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పరీక్షల సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను ఆర్‌ఆర్‌బీ విడుదల చేసింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి వివరాలు పొందవచ్చు. ఈ స్లిప్పులో పరీక్ష కేంద్రం, నగరం, పరీక్ష తేదీ, సమయం, మార్గదర్శకాలు వంటి తదితర సమాచారం మాత్రమే ఉంటుంది. ఇక అడ్మిట్‌ కార్డులు పరీక్షకు 4 రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. .

కాగా మొత్తం 4208 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి RRB ఈ ఉద్యోగ నియామకాలు చేపట్టింది. ఆర్‌ఆర్‌బీ ఆర్‌పీఎఫ్‌ రాత పరీక్షలు (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) మార్చి 2 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్‌లో పేర్కొంది. మొత్తం 120 ప్రశ్నలతో 90 నిమిషాల వ్యవధిలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు.. అలాగే తప్పు సమాధానాలకు 1/3వ వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రయత్నించని ప్రశ్నలకు మార్కులు ఉండవు, తీసీవేయరు. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్‌ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

జేఈఈ మెయిన్‌ బీఆర్క్‌/బిప్లానింగ్‌ ఫలితాలు విడుదల.. స్కోర్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే..

బీఆర్క్‌, బిప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం జనవరి 30వ తేదీన నిర్వహించిన జేఈఈ (మెయిన్‌) పేపర్‌ 2 పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఫిబ్రవరి 15న ప్రిలిమినరీ కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు 22వ తేదీన తుది కీ విడుదల చేశారు. తాజాగా ఫలితాలను కూడా అందుబాటులో తీసుకువచ్చారు. అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌, క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేసి స్కోరు కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

జేఈఈ మెయిన్‌ బీఆర్క్‌/బిప్లానింగ్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!