Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB NTPC Last Date: ఇంటర్‌, డిగ్రీ అర్హతతో 11,558 రైల్వే ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

రైల్వేశాఖలో ఇటీవల భారీగా ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో 11,558 ఖాళీల భర్తీ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్‌ కింద నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలో గ్రాడ్యుయేట్‌, అండర్‌ గ్రాడ్యుయేట్‌లకు సంబంధించి ఉద్యోగాలను..

RRB NTPC Last Date: ఇంటర్‌, డిగ్రీ అర్హతతో 11,558 రైల్వే ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పొడిగింపు
RRB NTPC
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 13, 2024 | 6:25 AM

రైల్వేశాఖలో ఇటీవల భారీగా ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో 11,558 ఖాళీల భర్తీ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్‌ కింద నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలో గ్రాడ్యుయేట్‌, అండర్‌ గ్రాడ్యుయేట్‌లకు సంబంధించి ఉద్యోగాలను భర్తీ చేస్తారు. మొత్తం పోస్టుల్లో 8,113 గ్రాడ్యుయేట్‌ స్థాయి పోస్టులు, 3,445 అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టులు ఉన్నాయి. అయితే ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు నేటితో ముగియనున్నాయి. తాజాగా దరఖాస్తు గడువును పొడిగిస్తూ ఆర్‌ఆర్‌బీ ప్రకటనను విడుదల చేసింది. 8,113 గ్రాడ్యుయేట్ పోస్టులకు దరఖాస్తు గడువు అక్టోబర్‌ 13 చివరి తేదీ. ఈ గడువును అక్టోబర్‌ 20, 2024వ తేదీ వరకు పొడిగించారు. ఇక 3,445 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు దరఖాస్తు గడువు అక్టోబర్‌ 20తో ముడియనుండగా.. తాజా ప్రకటనతో దానిని అక్టోబర్‌ 27వ తేదీ వరకు పొడిగించారు.

గ్రాడ్యుయేట్ కేటగిరీలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్ క్లర్క్, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్‌ పోస్టులకు డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు సంబంధిత పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోనివారు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

గ్రాడ్యుయేట్ పోస్టుల వివరాలు

  • కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ పోస్టులు: 1,736
  • స్టేషన్ మాస్టర్ పోస్టులు: 994
  • గూడ్స్ రైలు మేనేజర్ పోస్టులు: 3,144
  • జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు: 1,507
  • సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు: 732

అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల వివరాలు

  • కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు: 2,022
  • అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు: 361
  • జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు: 990
  • ట్రైన్స్ క్లర్క్ పోస్టులు: 72

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.