RRB NTPC 2024 Results: ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ 2024 గ్రాడ్యుయేట్‌ ఫలితాలు విడుదల.. స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

ఇండియన్‌ రైల్వే ఎన్‌టీపీసీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్‌ 2024 పోస్టుల సీబీటీ 2 పరీక్షల ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ)విడుదల చేసింది. తొలి దశలో అర్హత సాధించిన అభ్యర్ధులకు సెకండ్‌ స్టేజ్‌ కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష..

RRB NTPC 2024 Results: ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ 2024 గ్రాడ్యుయేట్‌ ఫలితాలు విడుదల.. స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్ లింక్‌ ఇదే
RRB NTPC Graduate 2024 CBT 2 Results

Updated on: Dec 16, 2025 | 6:13 AM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 16: ఇండియన్‌ రైల్వే ఎన్‌టీపీసీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్‌ 2024 పోస్టుల సీబీటీ 2 పరీక్షల ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ)విడుదల చేసింది. తొలి దశలో అర్హత సాధించిన అభ్యర్ధులకు సెకండ్‌ స్టేజ్‌ కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష అక్టోబర్‌ 13న జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలతోపాటు షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థుల జాబితాను ఆర్‌ఆర్‌బీ రీజియన్ల వారీగా ఆయా అధికారిక వెబ్‌సైట్‌లలో పొందుపరిచింది. కంప్యూటర్‌ బేస్‌డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌కు ఎంపికైన అభ్యర్థులు సంబంధిత ఆర్‌ఆర్‌బీ రిజీయన్‌ల అధికారిక వెబ్‌సైట్‌లలో అందించిన లింక్‌ ద్వారా లాగిన్‌ అయి వ్యక్తిగత స్కోర్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయడం ద్వారా లాగిన్‌ అయి స్కోర్‌ను చెక్‌ చేసుకోవచ్చు.

తాత్కాలికంగా షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు CBAT/TST టెస్ట్‌ను డిసెంబర్ 2025 ఐదవ వారంలో నిర్వహించేందుకు షెడ్యూల్ చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులకు అధికారిక RRB వెబ్‌సైట్‌లు, SMS, ఇమెయిల్ ద్వారా తెలియజేస్తారు. CBAT/TSTకి దాదాపు 10 రోజుల ముందు పరీక్ష నగర సమాచార స్లిప్ అందుబాటులో ఉంచుతారు. పరీక్ష తేదీకి దాదాపు 4 రోజుల ముందు ఈ-కాల్ లెటర్ విడుదల చేస్తారు.

CBAT/TST కోసం షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల అభ్యర్థిత్వం పూర్తిగా తాత్కాలికమేనని, వ్యత్యాసాలు, డేటా అసమానతలు, ఏదైనా దుర్వినియోగం గుర్తించబడితే నియామక ప్రక్రియ ఏ దశలోనైనా రద్దు చేసే అవకాశం ఉందని RRB స్పష్టం చేసింది. CBAT/TST కోసం ఎంపికైన అభ్యర్ధుల జాబితానే తుది ఎంపిక జాబితాగా పరిగణించబోమని ఈ సందర్భంగా పేర్కొంది. కాగా భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం గ్రాడ్యుయేట్‌ 8,113 ఖాళీలతో గతేడాది నోటిఫికేషన్‌ (CEN No.05/2024) విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ 2024 గ్రాడ్యుయేట్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.