RRB NTPC Result Date 2025: మరికొన్ని గంటల్లోనే ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఫలితాలు.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే
RRB NTPC CBT 1 Undergraduate Level Result 2025 Date And Time: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నాన్‌టెక్నికల్ పాపులర్ కేటగిరి (ఎన్‌టీపీసీ) అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల సీబీటీ 1 ఫలితాల కోసం నిరుద్యోగులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నుంచి కీలక ప్రకటన విడుదలైంది. తాజా ప్రకటన మేరకు..

హైదరాబాద్, నవంబర్ 19: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నాన్‌టెక్నికల్ పాపులర్ కేటగిరి (ఎన్‌టీపీసీ) అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల సీబీటీ 1 ఫలితాల కోసం నిరుద్యోగులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నుంచి కీలక ప్రకటన విడుదలైంది. తాజా ప్రకటన మేరకు గురువారం (నవంబర్ 20న) ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ సీబీటీ 1 ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు సంబంధిత ఆర్‌ఆర్‌బీ రిజీయన్ వెబ్‌సైట్‌లలో నుంచి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా ఈ నోటిఫికేషన్ కింద దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 8,113 గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవల గ్రాడ్యుయేట్ ఫలితాలు ప్రకటించిన బోర్డు.. అండర్ గ్రాడ్యుయేట్ ఫలితాల ప్రకటనకు సన్నాహాలు చేస్తుంది. సీబీటీ 1లో అర్హత సాధిచిన వారిని మాత్రమే సీబీటీ 2 పరీక్షకు అనుమతిస్తారు. ఇతర వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ సీబీటీ 1 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏపీ స్కూల్ విద్యార్థులకు ఉచిత ఎన్‌ఎంఎంఎస్ నమూనా పరీక్షతేదీ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థులకు నిర్వహించనున్న ఉచిత ఎన్‌ఎంఎంఎస్ నమూనా ప్రవేశ పరీక్ష తేదీ వడుదలైంది. తాజా ప్రకటన మేరకు ఈ పరీక్షను నవంబరు 30న నిర్వహిస్తున్నట్లు స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చింతల సుబ్బారావు, నరోత్తమరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షను నవంబర్ 30వ తేదీన ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు నవంబరు 20, 2025వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌కు 95027 66455, 99484 37301 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.








