AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JNVST 2026 Hall Tickets: నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్‌ టికెట్లు విడుదల.. రాత పరీక్ష ఎప్పుడంటే?

JNVST 2026 Admission: Navodaya Vidyalaya Class 6 hall tickets released: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ సమితి (NVS) పరీక్షల..

JNVST 2026 Hall Tickets: నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్‌ టికెట్లు విడుదల.. రాత పరీక్ష ఎప్పుడంటే?
JNVST 2026 Class 6th Hall Tickets
Srilakshmi C
|

Updated on: Nov 19, 2025 | 8:51 AM

Share

హైదరాబాద్‌, నవంబర్‌ 19: దేశ వ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ సమితి (NVS) పరీక్షల హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. JNVST 2026 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు navodaya.gov.in అధికారిక వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష 2026 హాల్‌ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కాగా జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే జేఎన్‌వీఎస్‌టీ 2026 ప్రవేశ పరీక్షను మొత్తం రెండు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశ పరీక్ష 2025 డిసెంబర్ 13న ఉంటుంది. ఇక రెండవ దశ పరీక్ష 2026 ఏప్రిల్ 11న ఉంటుంది. మొదటి దశ పరీక్ష ఆంధ్రప్రదేశ్, అస్సాం, బిహార్‌, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హరియాణ, జార్ఖండ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ (డార్జిలింగ్ మినహా) అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు (లడఖ్ మినహా).. వంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

ఇక రెండవ దశలో పరీక్ష జమ్మూ కాశ్మీర్‌లో ఎంపిక చేసిన జిల్లాలు అంటే జమ్మూ-I, జమ్మూ-II, సాంబా, ఉధంపూర్ మినహా మిగతా మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ (దిబాంగ్ వ్యాలీ & తవాంగ్), హిమాచల్ ప్రదేశ్ (చంబా, కిన్నౌర్, మండి, మొదలైనవి), పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని లేహ్ & కార్గిల్.. ప్రాంతాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇతర వివరాలను ఈ కింది అధికారిక వెబ్‌సైట్ లింక్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

జవహర్ నవోదయ విద్యాలయ అధికారిక వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

తెలంగాణ ఎఫ్‌ఎల్‌ఎస్‌కు 3వ తరగతి విద్యార్థులను సిద్ధం చేయాలంటూ డీఈఓలకు ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని 3వ తరగతి విద్యార్థులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్‌సీటీఈ ఆధ్వర్యంలోని ఫౌండేషన్‌ లెర్నింగ్‌ స్టడీ (ఎఫ్‌ఎల్‌ఎస్‌) నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలుగు, ఉర్దూ, గణితం సబ్జెక్టుల్లో పిల్లల అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తారని ఆయన తెలిపారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.