RRB NTPC Railway Exam Date: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ రైల్వే రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

RRB NTPC 2024 Undergraduate CBT 2 Exam Schedule: దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో ఎన్టీపీసీ అండర్‌ గ్రాడ్యుయేట్‌ 2024 సీబీటీ 2 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు రైల్వే బోర్డు షెడ్యూల్‌ను తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం..

RRB NTPC Railway Exam Date: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ రైల్వే రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
RRB NTPC 2024 Undergraduate CBT 2 Exam Date

Updated on: Nov 27, 2025 | 2:45 PM

హైదరాబాద్‌, నవంబర్‌ 26: దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో ఎన్టీపీసీ అండర్‌ గ్రాడ్యుయేట్‌ 2024 సీబీటీ 2 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు రైల్వే బోర్డు షెడ్యూల్‌ను తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం సీబీటీ 1 పరీక్షలో అర్హత సాధించిన వారందరికీ సీబీటీ 2 పరీక్ష డిసెంబర్‌ 20 (శనివారం)వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇటీవలే సీబీటీ 1 ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో మొత్తం 51,979 మంది సీబీటీ 2 పరీక్షకు అర్హత సాధించారు.

గత ఏడాది మొత్తం 3,445 పోస్టుల భర్తీకి ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ అండర్‌ గ్రాడ్యుయేట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద ఇంటర్‌ అర్హతతో వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలకు సంబంధించి అండర్‌ గ్రాడ్యుయేట్ కేటగిరీలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ పోస్టులను భర్తీ చేయనుంది. సీబీటీ పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లు, అడ్మిట్‌కార్డులు, ట్రావెల్‌ అథారిటీ వంటి వివరాలు పరీక్షకు పది రోజుల ముందు అన్ని ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచుతారు.

ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ సీబీటీ 2 పరీక్షల పూర్తి షెడ్యూల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.