RRB Group D Exam Date: ఆర్ఆర్‌బి గ్రూప్-డి పరీక్షకు సిద్ధమవుతున్నారా? కీలక సమాచారం మీకోసం..

RRB Group D Exam Date: ఆర్‌ఆర్‌బి గ్రూప్-డి పరీక్ష మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అధికారిక షెడ్యూల్ ప్రకారం..

RRB Group D Exam Date: ఆర్ఆర్‌బి గ్రూప్-డి పరీక్షకు సిద్ధమవుతున్నారా? కీలక సమాచారం మీకోసం..
Exam Date
Follow us

|

Updated on: Apr 12, 2021 | 4:13 PM

RRB Group D Exam Date: ఆర్‌ఆర్‌బి గ్రూప్-డి పరీక్ష మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అధికారిక షెడ్యూల్ ప్రకారం.. ఈ పరీక్ష ఏప్రిల్, జూన్ మధ్య జరగాల్సి ఉంది. అయితే, ఎన్‌టిపిసి పరీక్ష ఇంకా పూర్తి కాలేదు. ఎన్‌టిపిసి 7వ దశ పరీక్షను ఇంకా నిర్వహించలేదు. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇంకా రాలేదు. దాంతో ఈ పరీక్ష ఇంకాస్త ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో ఎన్టీపీసీ 7వ దశ పరీక్షలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ ఎన్టీపీసీ పరీక్షలు పూర్తయ్యే వరకు గ్రూప్-డి పరీక్షలు ప్రారంభం అయ్యే అవకాశం లేదు. ఆ కారణంగానే గ్రూప్-డి పరీక్షలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు.. ఎన్టీపీసీ అభ్యర్థులు 7వ దశ పరీక్ష షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పరీక్ష తరువాత, గ్రూప్-డి పరీక్ష తేదీ విడుదల అవుతుంది. గ్రూప్-డి పరీక్ష తేదీ ప్రకటించిన తరువాత.. దానికి సంబందించిన పూర్తి షెడ్యూల్‌ను కూడా ఖరారు చేయనున్నారు. ఎగ్జామ్ డేట్, ప్లేస్, సమయం వంటి వివరాలు ప్రకటిస్తారు. ఇక ఎగ్జామ్‌కు సంబంధించిన అడ్మిట్ కార్డును పరీక్షకు 4 రోజుల ముందు విడుదల చేయడం జరుగుతుంది. అభ్యర్థి తన అడ్మిట్ కార్డును సంబంధిత వివరాలతో ఆర్‌ఆర్‌బి వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఆర్‌ఆర్‌బి గ్రూప్-డి పరీక్షా విధానం: – గ్రూప్ డి కంప్యూటర్ బెస్ట్ టెస్ట్‌లో 100 ప్రశ్నలు అడుగుతారు. – పరీక్షలో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. – 3 ప్రశ్నలు తప్పుగా అటెంప్ట్ చేస్తే 1 మార్క్ కట్ అవుతుంది. – పరీక్షకు 90 నిమిషాలు సమయం కేటాయించడం జరుగుతుంది.

ఆర్‌ఆర్‌బి గ్రూప్-డి పరీక్షలో ఈ అంశాల నుండి ప్రశ్నలు వస్తాయి: గణితం: 25 ప్రశ్నలు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్: 30 ప్రశ్నలు జనరల్ సైన్స్: 25 ప్రశ్నలు జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్: 20 ప్రశ్నలు

Also read:

NASA Moon Mission 2024: నాసా కీలక నిర్ణయం.. 2024 కల్లా చంద్రుడిపైకి తొలి మహిళ.. ఈసారి శ్వేతజాతి వారిని కాకుండా…

prashant kishor on modi: ప్రధాని మోదీ ప్రజాదరణ కలిగిన నేత.. అయినా బెంగాల్ పీఠం మమతాదేః ప్రశాంత్ కిశోర్