Bank Note press Jobs: బ్యాంక్ నోట్ ప్రెస్‌లో టెక్నీషియన్‌ పోస్టులు.. నెలకు రూ. 70 వేల వరకు జీతం..

|

Oct 20, 2022 | 6:35 AM

బ్యాంక్ నోట్ ప్రెస్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థలో జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. మినీ రత్న కంపెనీలో మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు.?

Bank Note press Jobs: బ్యాంక్ నోట్ ప్రెస్‌లో టెక్నీషియన్‌ పోస్టులు.. నెలకు రూ. 70 వేల వరకు జీతం..
Bank Note Press Jobs
Follow us on

బ్యాంక్ నోట్ ప్రెస్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థలో జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. మినీ రత్న కంపెనీలో మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 14 జూనియర్ టెక్నీషియన్(ప్రింటింగ్) పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రింటింగ్ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ (లిథో ఆఫ్‌సెట్ మెషిన్ మైండర్/ లెటర్ ప్రెస్ మెషిన్ మైండర్/ ఆఫ్‌సెట్ ప్రింటింగ్/ ప్లేట్‌మేకింగ్/ ఎలక్ట్రోప్లేటింగ్)/ ఐటీఐ (ప్లేట్ మేకర్ కమ్ ఇంపోజిటర్/ హ్యాండ్ కంపోజింగ్). లేదా డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థుల వయసు 25 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఎంపికైన వారికి నెలకు రూ. 18,780 నుంచి రూ. 67,390 వరకు చెల్లిస్తారు.

* ఇతరులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్‌ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 14-11-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* ఆన్‌లైన్‌ పరీక్షను డిసెంబర్-2022/ జనవరి-2023లో నిర్వహిస్తారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..