AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITBP Recruitment: ఇంటర్‌, ఐటీఐ అర్హతతో హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ పోస్టులు.. ఎలా ఎంపిక చేస్తారంటే..

ఇండో - టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. గ్రూప్ సి నాన్-గెజిటెడ్(నాన్ మినిస్టీరియల్) విభాగంలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన పురుషులు, స్త్రీలు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు...

ITBP Recruitment: ఇంటర్‌, ఐటీఐ అర్హతతో హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ పోస్టులు.. ఎలా ఎంపిక చేస్తారంటే..
Itbp Recruitment
Narender Vaitla
|

Updated on: Oct 20, 2022 | 7:05 AM

Share

ఇండో – టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. గ్రూప్ సి నాన్-గెజిటెడ్(నాన్ మినిస్టీరియల్) విభాగంలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన పురుషులు, స్త్రీలు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 293 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) 126 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 107 పురుషులు, 19 స్త్రీలకు కేటాయించారు. అలాగే కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్): 167 పోస్టులు (పురుషులు- 142, స్త్రీలు- 25) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. 12వ తరగతి (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్) లేదా ఐటీఐ(ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ కంప్యూటర్)/ డిప్లొమా(ఎలక్ట్రానిక్స్/ కమ్యూనికేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎలక్ట్రికల్) పూర్తి చేసి ఉండాలి. కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.

* హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుంచి 25 ఏళ్లు, కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు చెల్లిస్తారు. కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 01-11-2022న మొదలవుతుండగా, 30-11-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్‌ఆర్‌టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్‌ ఉంటుందా?
దసరా పండుగకు టీజీఎస్‌ఆర్‌టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్‌ ఉంటుందా?