RBI Recruitment: డిగ్రీ పూర్తి చేస్తే చాలు ఆర్‌బీఐలో ఉద్యోగాలు… ఎలా ఎంపిక చేస్తారంటే..

ఆర్‌బీఐ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా విభాగంలో బ్యాచిలగర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతో పాటు అభ్యర్థులకు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ తప్పనిసరిగా ఉండాలి. అలాగే స్థానిక రాష్ట్ర భాషలో కచ్చితంగా ప్రావిణ్యం ఉండాలి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో....

RBI Recruitment: డిగ్రీ పూర్తి చేస్తే చాలు ఆర్‌బీఐలో ఉద్యోగాలు... ఎలా ఎంపిక చేస్తారంటే..
RBI Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 19, 2023 | 7:33 AM

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముంబయి కేంద్రంగా ఉండే ఈ సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటన చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇంతకీ మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

ఆర్‌బీఐ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా విభాగంలో బ్యాచిలగర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతో పాటు అభ్యర్థులకు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ తప్పనిసరిగా ఉండాలి. అలాగే స్థానిక రాష్ట్ర భాషలో కచ్చితంగా ప్రావిణ్యం ఉండాలి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అక్టోబర్‌ 4వ తేదీతో ముగియనుంది.

అభ్యర్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థులను ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామినేషన్‌, లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్ ఎగ్జామినేషన్‌తో పాటు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 450 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు కేవలం రూ. 50 ఫీజుగా చెల్లిస్తే సరిపోతుంది.

అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకొని అనంతరం అప్లికేషన్‌ ఫామ్‌ను ఆఫ్‌లైన్‌ విధానంలో పంపించాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను రీజినల్ డైరెక్టర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్, రిక్రూట్‌మెంట్ విభాగం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముంబయి రీజనల్ ఆఫీస్, షాహిద్ భగత్ సింగ్ రోడ్డు, ఫోర్ట్, ముంబయి చిరునామాకు పంపాలి. అక్టోబర్‌ 4వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగుస్తుంది. ప్రిలిమినరీ పరీక్షను అక్టోబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 23 వరకు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌ తేదీని డిసెంబర్‌ 02న నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను చూడండి.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

బీచ్‌లో ఫుడ్‌బాల్‌ అదరగొట్టిన శునకం.. వీడియో వైరల్
బీచ్‌లో ఫుడ్‌బాల్‌ అదరగొట్టిన శునకం.. వీడియో వైరల్
ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని..
ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని..
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!