RFCL Recruitment: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
RFCL Recruitment 2021: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ సంస్థలో మొత్తం 16 ఖాళీలను భర్తీ చేయనున్నారు...
RFCL Recruitment 2021: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ సంస్థలో మొత్తం 16 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 22తో ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* మొత్తం 16 ఖాళీలకు గాను అసిస్టెంట్ మేనేజర్ 1, మేనేజర్ 1, సీనియర్ మేనేజర్ 1, డిప్యూటీ మేనేజర్ (మెకానికల్) 2, మెకానికల్ మేనేజర్ 1, సివిల్ మేనేజర్ 1, ఐటీ డిప్యూటీ మేనేజర్ 1, ఐటీ మేనేజర్ 1, అకౌంట్స్ ఆఫీసర్ 1, సీనియర్ మెడికల్ ఆఫీసర్ 3, హెచ్‌ఆర్ మేనేజర్ 2, మెటీరియల్స్ మేనేజర్ 1 చొప్పున పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కెమికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ, బీటెక్, ఇఎస్సీ ఇంజినీరింగ్ చేసి ఉండాలి.
* అకౌంట్స్ ఆఫీసర్ సీఏ లేదా సీఎంఏ లేదా ఎంబీఏ, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంబీబీఎస్, హెచ్‌ఆర్ మేనేజర్ పోస్టుకు ఎంబీఏ, మెటీరియల్స్ మేనేజర్ పోస్టుకు ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేసి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
* దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 22తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Bank Loan Offer: ఈ బ్యాంకులో రుణాలు పొందేవారికి అదిరిపోయే శుభవార్త.. రూ.లక్షకు 630 ఈఎంఐ సదుపాయం..!
మహిళలు జాగ్రత్త..! గర్భధారణ సమయంలో ఈ ఆహారాలు అస్సలు తినకూడదు..?