Bigg Boss 5 Telugu: శ్వేత వెళ్లిపోవడానికి రవే కారణమా.? అసలు సన్నీ అలా ఎందుకు చేస్తున్నాడు.. ఇదంతా బిగ్‌బాస్ ప్లానేనా?
Bigg Boss 5 Telugu: వారం వారం గడుస్తున్న కొద్దీ బిగ్‌బాస్ షో మరింత రసవత్తరంగా మారుతోంది. నామినేషన్లతో హౌజ్ హీటెక్కుతోంది. గత వారం బిగ్‌బాస్ నుంచి శ్వేత ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే...
Bigg Boss 5 Telugu: వారం వారం గడుస్తున్న కొద్దీ బిగ్‌బాస్ షో మరింత రసవత్తరంగా మారుతోంది. నామినేషన్లతో హౌజ్ హీటెక్కుతోంది. గత వారం బిగ్‌బాస్ నుంచి శ్వేత ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. దీంతో హౌజ్ నుంచి మరో కంటెస్టెంట్‌ను బయటకు పంపించేందుకు సర్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఆరో వారంలో నామినేషన్ ప్రక్రియను బిగ్‌బాస్ ప్రారంభించారు. అయితే ఈసారి బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియను కాస్త భిన్నంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నిర్వహాకులు తాజాగా విడుదల చేసిన ప్రోమోలు ఎపిసోడ్‌పై ఆసక్తిని పెంచేసింది. సోమవారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతోన్న నేపథ్యంలో అందరి దృష్టి బిగ్‌బాస్ షోపై పడింది.
ఇక ప్రోమోల విషయానికొస్తే.. శ్రీరామ్ చంద్ర, సన్నీ, జెస్సీలు వేటగాళ్ల అవతారమెత్తారు. ఈ క్రమంలోనే ఓ టేబుల్‌పై ఉంచిన అరటి పండ్లను ఎవరైతే దక్కించుకుంటారో వారు.. హౌజ్ మేట్స్‌ను నామినేట్ చేసే అవకాశం లభిస్తుంది. ఈ టాస్క్‌లో షణ్ముఖ్, సిరి, కాజల్ గెలిచారు. అలా యానీ మాస్టర్‌ని షణ్ముఖ్ నామినేట్ చేయగా సిరి.. మానస్‌ని నామినేట్ చేసింది. ‘సారీ చెప్పారు. కానీ నేను దాన్ని అంగీకరించలేకపోతున్నా’ అని తెలియజేసింది. ఆ తర్వాత కాజల్.. ప్రియని నామినేట్ చేసింది. ఇందులో భాగంగా ఒక్కసారిగా అసహనానికి గురైన ప్రియాంక.. ‘అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు, నేను ఫేక్ పీపుల్స్‌తో ఉండను’ అంటూ అరిచేసింది. ఇక ‘శ్వేత నా వల్ల వెళ్లిపోయిందా..?’ అని గట్టిగా ప్రశ్నించడంతో ఒక్కసారిగా హౌజ్ అంతా సైలంట్ అయ్యింది.
‘గేమ్ మీరు ఆడొద్దు నేను ఆడతాను’ అని చెప్పిన సన్నీ.. ఒక్కసారిగా ఆటను మార్చేశాడు. దీంతో అసలు సన్నీ ఎందుకు ఇలా చేస్తున్నాడు నాకు అర్థం అవ్వట్లేదని.. యానీ మాస్టర్ అనడం అనుమానాలకు తావిస్తోంది. బిగ్‌బాసే సన్నీతో ఇలా చేయిస్తున్నాడా? అని అనుమానం కలుగుతోంది. మరి ఎలిమినేషన్ ప్రక్రియ ఎలాంటి మలుపు తిరుగుతుందో తెలియాలంటే రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే.
Also Read: Six Pack: తెగ తిని.. వ్యాయామం చేస్తే సిక్స్ ప్యాక్ వచ్చేయదు.. అందుకు అవి కూడా సపోర్ట్ చేయాలి!
Railway Rules: రైల్వే చట్టాల గురించి మీకు తెలుసా.! కారణం లేకుండా ట్రైన్ ఆపితే ఎన్నేళ్ల జైలు శిక్ష.?
ఐసీసీ ఫైనల్స్‌లో అదరగొట్టిన టాప్ 5 టీమిండియా బ్యాట్స్‌మెన్స్