Private Employees: ప్రైవేటు ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్.. భారీగా పెరగనున్న వేతనాలు..!
Private Employees: ప్రైవేటు ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్ రానుంది. ఈ ఏడాది పలు స్టార్టప్ కంపెనీల్లోని ఉద్యోగులకు ఆయా కంపెనీలు భారీగా..
Private Employees: ప్రైవేటు ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్ రానుంది. ఈ ఏడాది పలు స్టార్టప్ కంపెనీల్లోని ఉద్యోగులకు ఆయా కంపెనీలు భారీగా వేతనాలు పెంచేందుకు రెడీ అవుతున్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి. ఉద్యోగులు కరోనా మహమ్మారి కారణంగా భారీ ప్యాకేజీ అందించే కంపెనీల వైపు వెళ్తున్నారు. దీంతో ఉద్యోగులు ఇతర కంపెనీల వైపు వెళ్లకుండా భారీ ప్యాకేజీ ఇచ్చేందుకు కంపెనీలు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయా కంపెనీలలో తక్కువ వేతనాలతో పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. కాగా, ఇప్పటికే షిప్‌రాకెట్, అప్‌గ్రేడ్, సింప్లీలెర్న్, క్రెడ్‌అవెన్యూ, హోమ్‌లేన్, నోబ్రోకర్ వంటి తదితర స్టార్టప్‌లు 2022లో సగటు వేతన పెంపులు కోవిడ్ ముందు కంటే ఎక్కువ స్థాయిలో ఉంటాయని ప్రకటించినట్లు తెలుస్తోంది.
15 శాతం నుంచి 25 శాతం వరకు జీతల పెంపు
కాగా, తాజాగా వెలువడుతున్న నివేదికల ప్రకారం.. కొన్ని స్టార్టప్ కంపెనీలు సగటున 15 శాతం నుంచి 25 శాతం వరకు వేతనాలు పెంచనున్నాయి. మామూలు ఉద్యోగులతో పాటు మంచి ప్రతిభ కలిగిన ఉద్యోగులకు భారీ స్థాయిలో వేతనాలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు కంపెనీలు కూడా ప్రకటనలు చేసినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి: