AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‌Telangana Zonal System: తెలంగాణ నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. కొత్త జోనల్ వ్య‌వ‌స్థ‌కు రాష్ట్ర‌ప‌తి ఆమోదం..

Telangana Zonal System: తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డి సుమారు 7 ఏళ్లు గ‌డుస్తోన్నా జోన‌ల్ వ్య‌వ‌స్థ‌పై ఓ స్ప‌ష్ట‌త రాలేద‌న్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా కొత్త జోన‌ల్ వ్య‌వ‌స్థ‌కు రాష్ట్ర‌పతి ఆమోద...

‌Telangana Zonal System: తెలంగాణ నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. కొత్త జోనల్ వ్య‌వ‌స్థ‌కు రాష్ట్ర‌ప‌తి ఆమోదం..
Telangana Zonl System
Narender Vaitla
|

Updated on: Apr 21, 2021 | 2:56 PM

Share

Telangana Zonal System: తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డి సుమారు 7 ఏళ్లు గ‌డుస్తోన్నా జోన‌ల్ వ్య‌వ‌స్థ‌పై ఓ స్ప‌ష్ట‌త రాలేద‌న్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా కొత్త జోన‌ల్ వ్య‌వ‌స్థ‌కు రాష్ట్ర‌పతి ఆమోద ముద్ర వేయ‌డంతో ఈ విష‌యం ఓ కొలిక్కి వ‌చ్చింది. ఇక‌పై తెలంగాణ‌లో 95 శాతం ఉద్యోగాలు స్థానికుల‌చే భ‌ర్తీ చేయ‌నున్నారు. తాజాగా రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌.. తెలంగాణ‌లో 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లతో కూడిన కొత్త జోనల్‌ వ్యవస్థకు ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో అన్ని రకాల పోస్టుల్లోనూ ఓపెన్‌ కోటా 5 శాతం మాత్రమే ఉంటుంది. పోలీసు విభాగం మినహా ఇతర శాఖలన్నింటికీ కొత్త జోన్ల ప్రకారమే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతుంది. ఇదిలా ఉంటే 2018లో కొత్త జోన‌ల్ వ్య‌వ‌స్థ‌కు ఆమోదం ల‌భించింది. అయితే త‌ర్వాత ప్ర‌భుత్వం కొత్త‌గా మ‌రో రెండు జిల్లాల‌ను ఏర్పాటు చేసింది. వికారాబాద్‌ జిల్లాను జోగులాంబ జోన్‌ నుంచి చార్మినార్‌ జోన్‌కు మార్చగా.. రాష్ట్ర‌ప‌తి ఆమోదం అవ‌స‌ర‌ముండ‌డంతో ప్ర‌క్రియ ఆల‌స్య‌మైంది. తాజాగా రాష్ట్రపతి ఆమోదంతో కొత్త జోనల్‌ విధానం అమల్లోకి రానుంది. ఇదిలా ఉంటే ఇప్ప‌టి వ‌ర‌కు.. గ్రూప్‌–1లోని డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌ వంటి రాష్ట్రస్థాయి (స్పెసిఫైడ్‌ గెజిటెడ్‌ కేటగిరీ) పోస్టుల్లో 100 శాతం ఓపెన్‌ కోటాలోనే ఉన్నాయి. ఈ పోస్టుల కోసం తెలంగాణ ప్రాంతానికి చెందిన వారితోపాటు ఇతర రాష్ట్రాల వారూ పోటీపడి, ఉద్యోగాలు దక్కించుకునేవారు. అయితే ఇక‌పై ఆ అవ‌కాశం ఉండ‌దు.. ఓప‌న్ కోటా కేవ‌లం 5 శాతం మాత్ర‌మే ఉంటుంది. గ్రూప్‌–1 కేటగిరీలోని మిగతా పోస్టుల్లోనూ కొన్ని మల్టీజోన్, మరికొన్ని జోనల్‌ పోస్టులు ఉండేవి. మల్టీజోన్‌ పరిధిలో 40 శాతం పోస్టులు, జోనల్‌లో 30 శాతం, జిల్లా స్థాయిలో 20 శాతం పోస్టులు ఓపెన్‌ కేటగిరీలో ఉండేవి. వాటిల్లో ఇతర రాష్ట్రాల వారు, ఇతర జోన్ల వారు పోటీపడి ఉద్యోగాలు పొందేవారు.

Also Read: Sharad Pawar: మరోసారి ఆసుపత్రిలో చేరిన ఎన్సీపీ నేత శరద్ పవార్.. 21 రోజుల్లో మూడు సార్లు శస్త్ర చికిత్స

LIC: ప్రీమియం వసూళ్లలో ఎల్‌ఐసీ రికార్డు… కొత్త బిజినెస్‌ ప్రీమియం ఆదాయం రూ.1.84 లక్షల కోట్లు

ఆ బస్టాప్‏లో ఉన్నది దెయ్యమా.. లేక మనిషేనా.. కానీ ఆ లైన్.. ఇంటర్నెట్‌ని హడలెత్తిస్తోన్న ఫోటో…