Sharad Pawar: మరోసారి ఆసుపత్రిలో చేరిన ఎన్సీపీ నేత శరద్ పవార్.. 21 రోజుల్లో మూడు సార్లు శస్త్ర చికిత్స

ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ మరోసారి ఆసుపత్రిలో చేరారు. గతకొంతకాలంగా గాల్‌ బ్లేడర్‌ సమస్యతో బాధపడుతున్న ఆయనకు ముంబైలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్లో శస్త్రచికిత్స నిర్వహించారు వైద్యులు.

  • Balaraju Goud
  • Publish Date - 2:41 pm, Wed, 21 April 21
Sharad Pawar: మరోసారి ఆసుపత్రిలో చేరిన ఎన్సీపీ నేత శరద్ పవార్..  21 రోజుల్లో మూడు సార్లు శస్త్ర చికిత్స
Sharad Pawar

NCP Leader Sharad Pawar: ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ మరోసారి ఆసుపత్రిలో చేరారు. గతకొంతకాలంగా గాల్‌ బ్లేడర్‌ సమస్యతో బాధపడుతున్న ఆయనకు ముంబైలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్లో శస్త్రచికిత్స నిర్వహించారు వైద్యులు. మరోసారి పవర్‌కు చిన్న శస్త్రచికిత్స జరిగింది. గత 21 రోజుల్లో శరద్ పవార్‌కు ఇది మూడో ఆపరేషన్. ప్రస్తుతం శరద్‌ పవార్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు స్పష్టం చేశారు.

మరోవైపు శరద్‌ పవార్‌ ఆరోగ్యంపై వదంతులు రావడంతో ఎన్సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ స్పందించారు. అభిమానులు, కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు. శరద్‌ పవార్‌ ఆరోగ్యంగానే ఉన్నారని త్వరలో డిశ్చార్జ్‌ అవుతారని తెలిపారు.

అంతకుముందు, శరద్ పవార్ ఏప్రిల్ 12 న ఆయన విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు. దాటారు. అంతకుముందు శరద్ పవార్‌ను మార్చి 30 న బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చారు. కడుపు నొప్పితో మార్చి 30 న బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో అతనికి చిన్న శస్త్రచికిత్స జరిగింది. అప్పుడు డాక్టర్ ఏడు రోజులు విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చాడు. ఆ తర్వాత ఏప్రిల్ 12 న మళ్లీ పిత్తాశయానికి శస్త్రచికిత్స చేశారు. బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో డాక్టర్ బల్సారా శస్త్రచికిత్స నిర్వహించారు.

నవాబ్ మాలిక్ ట్వీట్
ఇదిలావుండగా, ఎన్‌సిపి ప్రతినిధి నవాబ్ మాలిక్ కూడా ఈ రోజు ట్వీట్ చేస్తూ పవార్ పరిస్థితి గురించి తెలియజేశారు. “మా పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ సాహెబ్ నిన్న సాయంత్రం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. అతనికి పిత్తాశయ శస్త్రచికిత్స జరిగింది. రోజూ చెకప్ కోసం ఆసుపత్రిలో చేర్పించారు. అతని ఆరోగ్యం మెరుగుపడుతోంది ”అని నవాబ్ మాలిక్ పేర్కొన్నారు.


Read Also….Oxygen Leaks : హాస్పిటల్ లోని భారీ ఆక్సిజన్ సిలిండర్ల నుంచి పెద్ద ఎత్తున లీకేజ్.. తెల్లని పొగలతో ఆప్రాంతమంతా భీతావహం