PGIMER Recruitment 2022: పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో 93 ఉద్యోగాలు.. నెలకు 67 వేల జీతంతో..
చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (PGIMER).. సీనియర్ రెసిడెంట్ (Senior Resident Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..
PGIMER chandigarh Senior Resident Recruitment 2022: చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (PGIMER).. సీనియర్ రెసిడెంట్ (Senior Resident Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
ఖాళీల సంఖ్య: 93
పోస్టుల వివరాలు: సీనియర్ రెసిడెంట్ (82), జూనియర్/సీనియర్ డెమాన్‌స్ట్రేటర్ (11) పోస్టులు
- సీనియర్ రెసిడెంట్ పోస్టులు
విభాగాలు: అనెస్తీషియా, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, న్యూక్లియర్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, ఆప్తల్మాలజీ, పాథాలజీ, పీడియాట్రిక్స్, సైకియాట్రీ, రేడియోథెరపీ, నెఫ్రాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.67,700లవరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- జూనియర్/సీనియర్ డెమాన్‌స్ట్రేటర్ పోస్టులు
విభాగాలు: బయోకెమిస్ట్రీ, న్యూక్లియర్ మెడిసిన్, పీడియాట్రిక్స్, ఫార్మకాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, న్యూట్రిషన్, ఎన్విరాన్‌మెంటల్ హెల్త్, ఎపిడిమియాలజీ, వైరాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.35,400ల నుంచి రూ.67,700లవరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఏ/ఎమ్మెస్సీ/పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
రాత పరీక్ష తేదీ: మే 27, 2022.
దరఖాస్తులకు చివరి తేదీ: మే 7, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: