PGCIL Recruitment 2021: ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌కి సువర్ణవకాశం.. పవర్‌ గ్రిడ్‌ నుంచి జాబ్‌ నోటిఫికేషన్.. మొత్తం పోస్టులు ఎన్నంటే..?

PGCIL Recruitment 2021: ఫీల్డ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (PGCIL) నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 137 పోస్టులు భర్తీ చేస్తారు. అభ్యర్థులు powergridindia.com ని

PGCIL Recruitment 2021: ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌కి సువర్ణవకాశం.. పవర్‌ గ్రిడ్‌ నుంచి జాబ్‌ నోటిఫికేషన్.. మొత్తం పోస్టులు ఎన్నంటే..?
Pgcil Recruitment
Follow us
uppula Raju

|

Updated on: Aug 19, 2021 | 6:07 AM

PGCIL Recruitment 2021: ఫీల్డ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (PGCIL) నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 137 పోస్టులు భర్తీ చేస్తారు. అభ్యర్థులు powergridindia.com ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.13 ఆగస్టు 2021 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. చివరి తేదీ 27 ఆగస్టు 2021గా నిర్ణయించారు. అర్హులైన అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకుంటే మంచిది. అప్లై చేయడానికి ముందు ఒక్కసారి అధికారిక నోటిఫికేషన్‌ని తనిఖీ చేయండి. చివరి తేదీ తర్వాత ఎలాంటి దరఖాస్తు ఫాంలు స్వీకరించరని స్పష్టం చేశారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) లో ఉద్యోగ అవకాశం అంటే పోటీ ఎక్కువగానే ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ ఫీల్డ్ ఇంజనీర్, ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టుల కోసం అర్హత గల అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మొదటగా అభ్యర్థులు powergrid.in ని సందర్శించాలి. తర్వాత కెరీర్ సెక్షన్, తరువాత ఉద్యోగ అవకాశాలు, ఆల్ ఇండియా బేసిస్‌పై ఎగ్జిక్యూటివ్ పోస్టులకు లాగిన్ అవ్వండి. ఆగస్టు 27 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఫీల్డ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)- 48 ఫీల్డ్ ఇంజనీర్ (సివిల్) – 17 ఫీల్డ్ సూపర్‌వైజర్ (ఎలక్ట్రికల్) – 50 ఫీల్డ్ సూపర్‌వైజర్ (సివిల్) – 22

అర్హత & వయోపరిమితి ఫీల్డ్ ఇంజనీర్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుంచి సంబంధిత సబ్జెక్టులో BE, B.Tech డిగ్రీని కలిగి ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు ఆగస్టు 27, 2021 నాటికి 29 ఏళ్లకు మించకూడదు. డిప్లొమా అభ్యర్థులు B.Sc, BE/ B.Tech, M.Tech/ ME డిగ్రీ కలిగి ఉండాలి.

జీతం, ఎంపిక ప్రక్రియ ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ .30,000 నుంచి రూ .1,20,000 వరకు వేతనం ఇస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూలో పనితీరు ఆధారంగా ఎంపిక చేస్తారు.

AP IIIT Notification Release: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల..

Minister Peddireddy: శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న మంత్రి పెద్దిరెడ్డి.. ఆయనతో పాటు మరో ఎంపీ, ఎమ్మెల్యే

AP Crime News: గుంటూరు జిల్లాలో బ్యాంకు ఉద్యోగి పేరిట మహిళకు టోకరా.. లక్ష రూపాయలు అపహరించిన దుండగుడు