Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Group 2 Answer Key Download: టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 పరీక్ష మీరూ రాశారా? కీలక ఆప్‌డైట్‌ చెక్‌ చేసుకోండి

తెలంగాణ గ్రూప్ 2 పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష రాసిన వారికి టీజీపీఎస్సీ కీలక అప్ డేట్ జారీ చేసింది. రాత పరీక్ష ప్రాథమిక ఆన్సర్ కీని తాజాగా కమిషన్ వెబ్ సైట్ లో అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఆన్సర్ కీతోపాటు రెస్పాన్స్ షీట్లను కూడా వెబ్ సైట్ లో ఉంచింది. ఆన్సర్ కీ పై అభ్యంతరాలు లేవనెత్తే వారు..

TGPSC Group 2 Answer Key Download: టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 పరీక్ష మీరూ రాశారా? కీలక ఆప్‌డైట్‌ చెక్‌ చేసుకోండి
TGPSC Group 2 Answer Key
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 19, 2025 | 1:37 PM

హైదరాబాద్‌, జనవరి 19: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు డిసెంబరు 15, 16 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. జనవరి 17న ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ని టీజీపీఎస్సీ విడుదల చేసింది కూడా. ప్రిలిమినరీ ‘కీ’తో పాటు పరీక్షలకు హాజరైన అభ్యర్ధుల మాస్టర్‌ ప్రశ్నపత్రాలు, రెస్పాన్స్‌ షీట్లను సైతం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇవి జనవరి 22వ తేదీ వరకు టీజీపీఎస్సీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు టీజీపీఎస్సీ సెక్రెటురీ డాక్టర్‌ ఇ నవీన్‌ నికోలస్‌ ఓ ప్రటనలో తెలిపారు. గ్రూప్‌ 2 అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి వీటిని డౌన్‌లోడ్‌ చేసుకుని, ఆన్సర్‌లను సరిచూసుకోవాలని సూచించారు.

అలాగే ప్రాథమిక జవాబు పత్రంలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లు గుర్తిస్తే వాటిపై సరైన అధారాలతో జనవరి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ విధానం ద్వారా మాత్రమే నమోదు చేయవల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆన్సర్‌ కీపై అభ్యంతరాలను ప్రత్యేకంగా ఇచ్చిన వెబ్‌ లింకు ద్వారా ఇంగ్లిష్‌ మాధ్యమంలో మాత్రమే నమోదు చేయవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ కాకుండా ఇతర పద్ధతుల్లో ఇచ్చిన అభ్యంతరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ స్వీకరింబోమని స్పష్టం చేశారు. అలాగే గడువు తేదీ ముగిసిన తరువాత వచ్చిన విజ్ఞప్తులను సైతం పరిగణించబోమని కమిషన్‌ సెక్రటరీ తన ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం నిపుణుల కమిటీ వచ్చిన విజ్ఞప్తులను సరిచూసి తుది ఆన్సర్‌ కీ తయారు చేస్తారు. అనంతరం రెండు మూడు రోజుల్లో గ్రూప్‌ 2 ఫలితాలు కూడా వెల్లడిస్తారు.

కాగా గ‌తేడాది డిసెంబ‌ర్‌లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రూప్ 2 రాత‌ప‌రీక్షలు ఆఫ్‌లైన్‌ విధానంలో జరిగిన సంగ‌తి తెలిసిందే. మొత్తం 783 గ్రూప్‌ 2 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 పరీక్ష ఆన్సర్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆ ప్లేయర్లపై ఓ కన్నెయడం ఖాయం!
ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆ ప్లేయర్లపై ఓ కన్నెయడం ఖాయం!
వేసవిలో తులసి మొక్క ఎండిపోతుందా.. ఈ చిట్కాలు ట్రై చేయండి..
వేసవిలో తులసి మొక్క ఎండిపోతుందా.. ఈ చిట్కాలు ట్రై చేయండి..
చేతిలో కొబ్బరి బోడం.. చిలిపితనంతో అల్లరి చేస్తున్న యంగ్ బ్యూటీ!
చేతిలో కొబ్బరి బోడం.. చిలిపితనంతో అల్లరి చేస్తున్న యంగ్ బ్యూటీ!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. చుక్కలు చూపిస్తున్న సూరీడు..
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. చుక్కలు చూపిస్తున్న సూరీడు..
హీట్ వేవ్ కి క్రికెటర్ మృతి
హీట్ వేవ్ కి క్రికెటర్ మృతి
మీ ఫోన్‌కు ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఎంత హానికరమో మీకు తెలుసా...?
మీ ఫోన్‌కు ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఎంత హానికరమో మీకు తెలుసా...?
ప్రియుడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుందనీ.. కూతురికి ఓ తండ్రి శిక్ష
ప్రియుడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుందనీ.. కూతురికి ఓ తండ్రి శిక్ష
రోజ్ వాటర్‌ని ఎక్కువ ఉపయోగిస్తున్నారాచర్మానికి ఎంత హనికరమో తెలుసా
రోజ్ వాటర్‌ని ఎక్కువ ఉపయోగిస్తున్నారాచర్మానికి ఎంత హనికరమో తెలుసా
పాక్‌ సరిహద్దుల్లో డ్రోన్‌ ద్వారా డ్రగ్స్‌, ఆయుధాలు రవాణా..
పాక్‌ సరిహద్దుల్లో డ్రోన్‌ ద్వారా డ్రగ్స్‌, ఆయుధాలు రవాణా..
అశ్విన్ సెంచరీ టెస్ట్ డ్రీమ్.. ధోనీ సప్రైజ్ గిఫ్ట్!
అశ్విన్ సెంచరీ టెస్ట్ డ్రీమ్.. ధోనీ సప్రైజ్ గిఫ్ట్!